Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కవితకు బీఆర్ఎస్ తలుపులు మూసుకుపోయినట్లేనా?
posted on: May 28, 2025 3:04PM

పార్టీ కంటే ముందే అనుబంధ సంస్థల ప్రకటన? కవిత స్పీడ్ మామూలుగా లేదుగా?
తెలంగాణ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత స్పీడ్ ఓ రేంజ్ లో ఉంది. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలను గమనిస్తే.. కవిత బీఆర్ఎస్ తో తెగతెంపులు చేసుకోవడానికే నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె జాగృతి సంస్థతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అంతే కాదు సింగరేణి ప్రాంతంలో పార్టీతో సంబంధం లేకుండా తన సొంత కమిటీలను ఏర్పాటు చేసేశారు. ఆ మేరకు ప్రకటన కూడా చేశారు. తెలంగాణ రాజకీయాలలో మరీ ముఖ్యంగా నార్త్ తెలంగాణ లో సింగరేణి ప్రాబల్యం ఎక్కువ. సింగరేణి ప్రాంతంలో కవితకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే సింగరేణి ప్రాంతానికి సబంధించి కవిత సొంతంగా కమిటీలను ఏర్పాటు చేయడం, కోఆర్డినేటర్లను నియమించడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
పార్టీలో అంతా బాగున్నప్పుడు సింగరేణి ప్రాంతంలో అనుబంధ సంఘాల బాధ్యతలన్నీ కవితే నిర్వహించిన సంగతి తెలిసిందే. అలాగే సింగరేణి కార్మికుల గుర్తింపు సంఘం ఎన్నికలలోనూ బీఆర్ఎస్ తరఫున కవితే అన్నీ తానై చూసుకునే వారు. అటువంటి కవిత ఇప్పుడు బీఆర్ఎస్ తో సబంధంధం లేకుండా జాగృతి కార్యవర్గాన్ని ప్రకటించడం, కోఆర్డినేటర్లను నియమించడంతో ఆమె భవిష్యత్ అడుగులు ఎలా ఉండబోతున్నాయన్న విషయంలో ఒక క్లారిటీ ఇచ్చేసినట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
గత కొన్ని రోజులుగా వరుసగా జరిగిన పరిణామాలను గమనించిన ఎవరికైనా కవిత అడుగులు బీఆర్ఎస్ కు దూరంగా పడుతున్నాయన్న విషయం ఇట్టే అవగతమైపోతుంది. సామాజిక తెలంగాణ అంటూ కవిత గతంలో చేసిన ప్రకటనలు, వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు కానీ, కార్యకర్తలు కానీ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఎప్పుడైతే ఆమె తన తండ్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు లేఖ రాశారో.. అప్పుడే ఆమె పార్టీకి మానసికంగా దూరమయ్యాన్న విషయం అవగతమైందని పరిశీలకులు అంటున్నారు. ఇక ఆ లేఖ లీక్.. తదననంతర పరిణామాలు గమనిస్తే బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు శిబిరం నుంచి కవితకు ఇసుమంతైనా ప్రాధాన్యం లేదన్న క్లారటీ వచ్చేస్తుంది.
అన్నిటికీ మించి కవిత తన తండ్రి, పార్టీ అధనేత కేసీఆర్ కు రాసిన లేఖలో చేసిన ఆరోపణలు చాలా తీవ్రంగా ఉన్నాయి. ఆమె లేఖను బట్టి చేస్తే ఇంత కాలంగా కాంగ్రెస్ చేస్తున్న బీజీపీ బీటీమ్ బిఆర్ఎస్ అన్న విమర్శలలో వాస్తవం ఉంది అనిపించకమానదని పరిశీలకులు అంటున్నారు. కవిత లేఖ మేరకు గులాబీ జెండా కాషాయ వర్ణంలోకి మారుతోందా అన్న అనుమానాలు కలగక మానవని బెబుతున్నారు. ఆ లేఖ ద్వారా బీఆర్ఎస్, బీజేపీ నెక్సస్ వాస్తవమేనని కవిత చాటినట్లైందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కవిత లేఖపై స్పందించే కంటే ఆమెను దూరం పెట్టి ఆమె దారి ఆమె చూసుకునేలా చేయడమే బటరన్న నిర్ణయానికి కేసీఆర్ వచ్చేసినట్లు కనిపిస్తోందంటున్నారు. అందుకే లేఖ వెలుగులోకి వచ్చి ఇన్ని రోజులైనా కేసీఆర్ ఆమెను పిలిపించుకుని మాట్లాడటం కానీ, ఆ లేఖపై స్పందించడం కానీ చేయలేదని చెబుతున్నారు. సో.. ఇహనో ఇప్పుడో, తేదా నేడో, రేపో కవిత తన దారి తాను చూసుకోవడం ఖాయమంటున్నారు. అదే జరిగితే కవితను అనుసరించడానికి బీఆర్ఎస్ లో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని కూడా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.


.webp)



