Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కోహినూర్ వజ్రాన్ని తిరిగి ఇచ్చే ప్రసక్తే లేదు
posted on: Feb 21, 2013 4:25PM

బ్రిటీష్ రాణి ఎలిజబెత్-2 కిరీటంలో ఉన్న కోహినూర్ వజ్రాన్ని తిరిగి ఇచ్చేదిలేదని తేల్చి చెప్పారు బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్. భారత్ పర్యటనలో ఉన్న ఆయన కోహినూర్ తమదేనని అన్నారు. 1850లో బ్రిటన్ రాణికి అప్పటి గవర్నర్ జనరల్ బహుమానంగా ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.
1997లో రాణి ఎలిజబెత్ భారత పర్యటనకు వచ్చినప్పటి నుంచి ఈ వజ్రాన్ని భారత్‌కు తిరిగి ఇచ్చివేయాలనే వాదన వస్తోంది. 109 క్యారెట్ల కోహినూర్ వజ్రం ప్రపంచంలో ఉన్న అతి పెద్ద వజ్రాల్లో ఒకటి. ఈ వజ్రాన్ని తిరిగి ఇవ్వాలని బ్రిటన్ ను భారత్ కోరినా ఇప్పటికీ ఫలితం లేదు. తాజాగా బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ కూడా ఇవ్వమని చెబుతున్నారు.
1919లో జరిగిన జలియన్‌వాలా బాగ్ ఊచకోత బ్రిటిష్ చరిత్రలోనే అత్యంత సిగ్గుచేటైన సంఘటన అని బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ చెప్పిన విషయం తెలిసిందే. స్వాతంత్ర్య పోరాటం సందర్భంగా భారతదేశంలో బ్రిటిష్ పాలనలో ఈ ఊచకోత జరిగింది. జలియన్‌వాలా బాగ్‌ను సందర్శించిన తొలి బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ మాత్రమే. సంఘటనకు క్షమాపణ చెప్పడానికి మాత్రం ఆయన ఇష్టపడలేదు.






