Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...జాగ్రత్త ఈ సమస్యలు ఉన్నవారు వంకాయ తింటే డేంజర్..!
posted on: Sep 12, 2025 9:30AM
.webp)
వంకాయ చాలామందికి ఇష్టమైన కూరగాయ. వంకాయను ఎలా వండినా టేస్ట్ అద్దిరిపోతుంది. తాజా కూరలలో రాజా ఎవరండీ అని వంకాయ మీద పాట రాశారు.. అలాగే వంకాయ వంటి కూర.. పంకజ ముఖి సీత వంటి భామామణి అంటూ పద్యం కూడా రాశారు. ఇలా వంకాయ క్రేజ్ చాలా పెద్దదే.. అయితే వంకాయను అందరూ తినడం అంత మంచిది కాదు.. కొన్ని సమస్యలు ఉన్నవారు వంకాయకు ఎంత దూరం ఉంటే అంత మంచిది. సరదా పడి తిన్నారంటే ఆ తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. ఇంతకీ వంకాయకు దూరంగా ఎవరు ఉండాలి? ఎందుకని? పూర్తీగా తెలుసుకుంటే..
వంకాయలో అధికమొత్తంలో ఆక్సలేట్ ఉంటుంది. ఇది మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది. వంశపారంపర్యంగా కిడ్నీలో రాళ్లు, కిడ్నీ సమస్యలతో ఇబ్బంది పడేవారు వంకాయ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
వంకాయ తింటే కొందికి అలెర్జీ వస్తుంది. ఇది దురద, వాపు, శ్వాస సంబంధ సమస్యలను కూడా కలిగిస్తుంది. అందుకే వంకాయ తినేముందు ఆరోగ్య సమస్య విషయంలో ఆలోచించుకోవాలి.
చాలామందికి తెలియదు కానీ.. వంకాయ తింటే గ్యాస్, ఉబ్బరం సమస్యలు పెరుగుతాయి. ఇప్పటికే గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలతో ఇబ్బంది పడేవారు వంకాయ తినేముందు ఆలోచించాలి. మరీ ముఖ్యంగా తినాలనుకున్నా సరే.. పరిమిత పరిమాణంలో మాత్రమే తినాలి. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా వంకాయను వైద్యుల సలహా మీద మాత్రమే తినడం మంచిది.
వంకాయలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. కాబట్టి రక్తపోటు సమస్య ఉన్నవారు.. రక్తపోటు సమస్య కోసం మందులు వాడేవారు వంకాయలు ఎక్కువగా తినకూడదు.
వంకాయలలో సోలననిన్ అనే రసాయనం ఉంటుంది. ఇది కీళ్లలో నొప్పి, వాపు పెంచడంలో సహాయపడుతుంది. సాధారణంగా పెద్దలు అంటూ ఉంటారు.. వంకాయలు ఎక్కువ తినకు వాతం పెరుగుుతంది అని. ఇది ఆ కోవకు చెందినదే.. ఆర్థరైటిస్ సమస్య ఉన్నవారు వంకాయను ఎంత తక్కువ తింటే అంత మంచిది.
వంకాయలను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో సోడియం, పొటాషియం స్థాయిల సమతుల్యత దెబ్బ తింటుంది.
*రూపశ్రీ.
గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...


.webp)
.webp)


