TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కొత్త పెళ్ళికొడుకు మృతి

Published on: Tue Apr 7, 2015 9:44AM

 

కొద్ది గంటల క్రితమే వారిద్దరికీ పెళ్ళయింది. పెళ్ళి తర్వాత నవ వధూవరుల బృందం దేవాలయానికి బయల్దేరారు. అయితే దారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పెళ్ళికొడుకుతోపాటు మరొకరు మరణించగా, పెళ్ళికూతురు పరిస్థితి విషమంగా వుంది. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అచ్చంపేట గ్రామానికి చెందిన వెంకట ప్రసాద్ (27)కు అదే ప్రాంతానికి చెందిన లక్ష్మిస్వాతి (19)తో సోమవారం ఉదయం వివాహం జరిగింది. పెళ్ళయిన తర్వాత నూతన వధూవరులు, వారి బంధువులు తుఫాన్ వాహనంలో తిరుమలకు బయల్దేరారు. అయితే మంగళవారం తెల్లవారుఝామున కాజీపేట మండలం చెన్నముక్కపల్లె సమీపంలో రోడ్డు పక్కన నిలిపిఉన్న లారీని వీరు ప్రయాణిస్తున్న వాహనం ఢీకొట్టింది. దీంతో వెంకట ప్రసాద్‌తో పాటు అతని బంధువు నర్సమ్మ(50) అక్కడికక్కడే మృతిచెందారు. పదిమందికి తీవ్రగాయాలయ్యాయి. పెళ్లి కూతురు లక్ష్మిస్వాతితో పాటు మరో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.