TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ముహూర్త సమయానికి రాలేదని.. పెళ్లి మండపంలోనే వరుడిని మార్చేసిన పెళ్లికూతురు

Published on: Wed May 18, 2022 6:22AM

ఈ మధ్య పెళ్లి పీటల  దాకా వచ్చిన పెళ్లిళ్లు ఆగిపోవడానికి చాలా చాలా చిన్న చిన్న విషయాలు కారణమౌతున్నాయి. తాజాగా ఓ యువతి పెళ్లి కొడుకు బారాత్ లో మునిగిపోయి ముహూర్త సమయాన్ని మరచిపోయాడు. దీంతో ఆగ్రహించిన వధువు వేరే వ్యక్తిని పెళ్లాడేసింది. 

ఈ సంఘటన రాజస్థాన్ లో జరిగింది. ఆదివారం అంటే మే 15న పెద్దలు పెళ్లి ముహూర్తం నిర్ణయించారు. సంప్రదాయం ప్రకారం పెళ్లి కూతురు గ్రామానికి వరుడు బంధు, మిత్ర సపరివారంగా తరలి వచ్చాడు. అదే సంప్రదాయం ప్రకారం బారత్ ఏర్పాటు చేశారు. అదే చిక్కు తెచ్చి పెట్టింది. బారాత్ ఉత్సాహంలో డ్యాన్సుల్లో మునిగి పోయిన పెళ్లి కొడుకు ముహూర్తం సమయం మరచిపోయాడు. 

రాత్రి ఒంటిగంటా 15 నిముషాలకు పెళ్లి ముహూర్తం నిశ్చయించారు. అయితే బారాత్ డ్యాన్సలలో మైమరచిపోయిన పెళ్లి కొడుకు ఆ సమయానికి పీటల మీదకు రాలేదు. దీంతో కోపగించిన పెళ్లి కూతురు అదే మంటపంలో మరో యువకుడితో తాళి కట్టించేసుకుంది. బారాత్ మత్తు దిగిన తరువాత ఇది అన్యాయం అంటూ ఆ పెళ్లి కొడుకు లబొదిబో మన్నాడు. పోలీసులను ఆశ్రయించాడు. అయినా ఫలితం లేకపోయింది.