TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు తీవ్ర అస్వస్థత

Published on: Wed Jun 4, 2025 11:57AM

మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.  వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న వెనుపోటు దినంలో భాగంగా  చీపురుపల్లిలో ఆయన ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదికపై ప్రసంగిస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన ఒక్క సారిగా స్ఫృహతప్పి కుప్పకూలిపోయారు.

వెన్నుపోటు దినంలో భాగంగా వేదికపై మాట్లాడుతూ ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దీంతో పార్టీ కార్యకర్తలు బొత్సను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.   బొత్స సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. వడదెబ్బకు గురి కావడం వల్ల ఆయన స్పృహ తప్పి పడిపోయారని తెలుస్తోంది.