జూన్ 7న వైకాపాలో బొత్స చేరే అవకాశం
posted on Jun 2, 2015 8:59AM
(4).jpg)
మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వైకాపాలో చేరడం దాదాపు ఖాయం అయినట్లే. ఆయన ఈనెల 7వ తేదీన జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైకాపాలో చేరే అవకాశం ఉన్నట్లు తాజా సమాచారం. ఇంతకు ముందు ఆయన ఈనెల 9న విజయనగరంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి దానికి జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించి ఆయన సమక్షంలో వైకాపాలో చేరుదామని భావించినట్లు వార్తలు వచ్చేయి. కానీ పార్టీలోకి తన రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జిల్లా వైకాపా నేతల ముందు ఆ విధంగా బల ప్రదర్శన చేయడం వలన వారి నుండి మరింత వ్యతిరేకత ఎదుర్కోవలసి వస్తుందనే ఆలోచనతో దానిని విరమించుకొన్నట్లు సమాచారం. కనుక లోటస్ పాండ్ నివాసంలోనే జగన్ సమక్షంలో జూన్ 7న వైకాపాలో చేరాలని బొత్స సత్యనారాయణ భావిస్తున్నట్లు తెలుస్తోంది.