జగన్, అనిల్ ను రక్షించారు..!!

 

 

 

అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చేసిన ప్రకటనను ఆసరాగా చేసుకుని తెలుగుదేశం పార్టీ తీవ్రంగా స్పందించింది. పార్టీ సీనియర్ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖరరెడ్డి మీడియాతో మాట్లాడుతూ బొత్స తాను బ్రదర్ అనిల్ తప్పు చేస్తే రక్షించానని చెబుతున్నారని, ఆ విషయం బయటపెట్టాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగంపై ప్రమాణం చేసిన మంత్రిగా ఆయన బాధ్యతతో వ్యవహరించాలని అన్నారు. ముఖ్యమంత్రి తాను గతంలో జగన్ ను రక్షించానని అన్నారని, అలాగే ఇప్పుడు బొత్స తాను అనిల్ ను రక్షించారని అంటారని, వీరందరిని వై.ఎస్.రాజశేఖరరెడ్డి కాపాడారని ఆయన మద్దతుదారులు చెబుతారని, కాంగ్రెస్ లో ఇదంతా ఒక చిత్రమైన పరిస్థితి అని ఇవన్ని బయటకు రావలసిన అవసరం ఉందని రావుల వ్యాఖ్యానించారు.

 

అయితే ఇదిలా ఉంటే ఒక నాయకుడు ఎన్నో మంచి పనులు చేసి ప్రజాసేవకుడై స్వలాభాపేక్షకు గురికానివారు గుర్తింపు సాధించి, ఇప్పడు కష్టాలలో ఉన్నారంటే అతడిని కాపాడడానికి తోటి నాయకులు కష్టపడితే పర్వాలేదు. కాని జనం డబ్బు దోచుకొని రాజభోగాలు అనుభవించే నాయకులను కాపాడడమేంటి ఒక రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్నాడంటే అతని వెనుక ఎన్నో అక్రమాలు ఉంటున్న ఈ రోజుల్లో ఆ రాజకీయ నాయకుడి రక్షించామని చెప్పుకోవడం ఏంటోనని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.