Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...అంగరంగ వైభవంగా బొత్స కూతురు పెళ్లి
posted on: Nov 3, 2012 6:22PM

పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ కుమార్తె సత్యశ్రీ, భరత్ కుమార్‌ల వివాహం విజయనగరంలో అంగరంగ వైభవంగా జరిగింది. పండితులు నిర్ణయించిన శుభముహూర్తం 10.05 గంటలకు ఈ జంట ఒక్కటయింది. వివాహ వేడుకకు విజయనగరంలోని బొత్స నివాసం కల్యాణ వేదికగా నిలిచింది.
సినీ ఆర్ట్ డైరెక్టర్ అశోక్ కుమార్ పెళ్లి మండపం సెట్ వేశారు. మండపంలో వేంకటేశ్వరుడి నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేశారు. ఆయన పాదాల వద్ద పెళ్లి పీటలను ఏర్పాటు చేశారు. పెళ్లికి బంధువులు, ప్రముఖులు వస్తుండటంతో విజయనగరం రహదారులు ఉదయం నుండే కళకళలాడాయి.
బొత్స దంపతులు అందరినీ సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, గవర్నర్ నరసింహన్, డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య, కేంద్రమంత్రులు జైపాల్ రెడ్డి, చిరంజీవి, పళ్లంరాజు, పనబాక లక్ష్మి, పార్లమెంటు సభ్యులు లగడపాటి రాజగోపాల్, యాష్కీ, తెరాస చీఫ్ కూతురు కవిత, బిజెపి నేతలు దత్తాత్రేయ తదితరులు భారీగా హాజరయ్యారు.


.jpg)



