ఆదర్శ్ కుంభకోణంపై మహారాష్ట్ర కోర్టు సంచలన నిర్ణయం.... బిల్డింగ్ కూల్చేయండి

 

మహారాష్ట్రలో ఆదర్శ్ కుంభకోణం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు దీనిపై మహారాష్ట్ర కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. ఆదర్శ్ సొసైటీ అక్రమంగా నిర్మించిన 31 అంతస్థుల భవనాన్ని వెంటనే కూల్చేయాలని ఆదేశించింది. కార్గిల్‌ యుద్ధంలో అమరులైన జవాన్ల కుటుంబాలకు కేటాయించిన స్థలంలో అక్రమంగా ఈ నిర్మాణం చేపట్టారని.. అమరవీరుల కుటుంబాలకు కాకుండా రాజకీయ నేతలు, వారి బంధువులకు ప్లాట్లు కేటాయించారని కోర్టు తెలిపింది.

 

కాగా అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ ఆదర్శ్ సొసైటీ భవనంలో ముగ్గురు బంధువులకు కూడా ప్లాట్లు కేటాయించిన ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆయన తన పదవిని కూడా కోల్పోవాల్సి వచ్చింది. అంతేకాదు ఆదర్శ్ భవనంలోని 102 ప్లాట్లలో 25 ప్లాట్లు అక్రమంగా ఇచ్చినవేనని 2013లో జ్యూడిషియరీ కమిషన్ గుర్తించిం కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పుడు దీనిపై విచారించిన కోర్టు భవంతిని కూల్చేయాల్సిందిగా ఆదేశించింది.