Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బస్సులో బాంబు పేలుడు.. 11 మంది మృతి
posted on: Oct 20, 2015 12:15PM

పాకిస్థాన్‌లోని ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పాకిస్థాన్‌లోని బెలూచిస్థాన్ లోని ప్రావెన్స్ లో ఓ ప్రయివేటు బస్సులో బాంబు పేలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులతో సహా 11 మంది మరణించగా.. మరో 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వివరాల ప్రకారం.. పాకిస్థాన్‌లోని బెలూచిస్థాన్ లోని పనిచేసే కూలీలు తిరిగి ఇంటికి వెళ్లేందుకు ప్రతి రోజు అర్దరాత్రి ఓ ప్రయివేటు బస్సు బస్ స్టాండ్ లో ఉంటుంది. రోజు లాగానే కూలీలు బస్కు ఎక్కగా ఇంతలో బస్సులో అమర్చిన బాంబు పేలింది. దీంతో 11 మంది అక్కడికక్కడే మరణించారు. అయితే ఈ ఘటనకు పాల్పడింది ఎవరనేది ఇంకా తెలియలేదని.. ఉగ్రవాదులు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని, దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి అల్మీష్ ఖాన్ చెప్పారు.






