TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నటి జియాఖాన్ ఆత్మహత్య పై రాంగోపాల్ వర్మ

Published on: Tue Jun 4, 2013 7:13PM

 

 

bollywood Actor Jiah Khan dead, Actor Jiah Khan death, Actor Jiah Khan dies, Actor Jiah Khan died, Actor Jiah Khan no more

 

 

ప్రముఖ నటి జియాఖాన్ ఆత్మహత్య వార్త విని బాలీవుడ్ షాక్ కి గురైంది. ఆమె మృతిపై అందరూ తీవ్ర సంతాపం వెలిబుచ్చారు. “నేను షాక్ కు గురయ్యాను. హీరోయిన్ జియాఖాన్ ఆత్మహత్య చేసుకుంది అన్న వార్త నాకు ఊపిరాడనంత పనిచేసింది. నిశ్శబ్ద్ సినిమా తీస్తున్న సమయంలో జియాఖాన్ అంత ఉత్సాహం కలిగిన నటిని నేను చూడలేదు” అని ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ లో పేర్కొన్నాడు. ఆమె టాలెంటెడ్ యంగ్ గర్ల్ అని పేర్కొన్నారు. 2007లో వర్మ తీసిన నిశ్శబ్ద్ సినిమాలో అమితాబ్ సరసన జియాఖాన్ నటించింది. అందులో జియాఖాన్ నటన అందరినీ ఆకట్టుకుంది. దీంతో ఆమీర్ ఖాన్ గజినీలో అవకాశం ఇచ్చాడు. జియాఖాన్ ఆత్మహత్య వార్త విని షాక్ కు గురయ్యానని అమితాబ్ కూడా తీవ్ర సంతాపం వెలిబుచ్చారు.