Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బ్లడ్ గ్రూప్ బట్టి గుండెపోటు!
posted on: Sep 21, 2024 9:30AM

వినడానికి చిత్రంగా ఉంది కదా. కానీ లక్షలమందిని పరిశీలించిన తరువాతే ఈ మాట చెబుతున్నామంటున్నారు శాస్త్రవేత్తలు. నెదర్లాండ్స్‌కు చెందిన టెస్సా అనే పరిశోధకురాలు తేల్చిన ఈ వివరం ఇప్పుడు వైద్యలోకంలో సంచలనం సృష్టిస్తోంది.
గుండెజబ్బులకీ బ్లడ్‌గ్రూపుకీ ఏ మేరకు సంబంధం ఉందో తెలుసుకునేందుకు ఏకంగా పదమూడు లక్షలమందిని పరిశీలించారు. ఇందులో myocardial infarction, coronary artery disease, ischaemic heart disease, heart failure వంటి గుండె సమస్యలు ఉన్నవారిని బ్లడ్ గ్రూప్ ఆధారంగా విభజించారు. వీరిలో O గ్రూప్ రక్తం ఉన్నవారితో పోలిస్తే ఇతర బ్లడ్ గ్రూప్ ఉన్నవారిలో గుండె సమస్యలు దాదాపు 9 శాతం ఎక్కువగా ఉన్నట్లు తేలింది.
O గ్రూప్ రక్తం వారికీ, ఇతరులకీ మధ్య ఇంత వ్యత్యాసం ఉందన్న విషయం మీద ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉంది. అయితే ఇప్పటికే రెండు కారణాలని ఊహిస్తున్నారు.
- O గ్రూప్ కాని వ్యక్తులలో von Willebrand అనే ప్రొటీన్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందట. ఈ ప్రొటీను వల్ల రక్తం త్వరగా గడ్డకడుతుంది. ఏదన్నా గాయం అయినప్పుడు ఇలా రక్తం గడ్డకట్టడం మంచిదే అయినా... కొన్ని సందర్భాలలో అది గుండెపోటుకి దారితీసే ప్రమాదం ఉంది.
- A గ్రూప్ రక్తంవారిలో ఉండే కొన్ని జన్యువుల వల్ల, వారిలో కొలెస్టరాల్ పేరుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందట. ఇలా కొలెస్టరాల్ పేరుకోవడం వల్ల గుండె ధమనులు పూడుకుపోతాయన్న విషయం తెలిసిందే కదా!
- O గ్రూపు కాని వ్యక్తులలో galectin-3 అనే ప్రొటీన్ ఉత్పత్తి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది శరీర భాగాలలో వాపుని (inflammation) నియంత్రిస్తుంది. ఈ ప్రొటీన్ కారణంగా గుండెజబ్బులు ఉన్నవారిలో సమస్యల మరింత తీవ్రతరమైపోతుందట.
మొత్తానికి O గ్రూప్ వారితో పోలిస్తే ఇతరులు కాస్త జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు పరిశోధకులు. ఇక మీదట వైద్యులు కూడా తమ దగ్గరకి వచ్చే రోగులకి చికిత్స చేసేటప్పుడు వారి బ్లడ్ గ్రూప్‌ని దృష్టిలో ఉంచుకోవాలని చెబుతున్నారు.
- నిర్జర.






