అవిశ్వాస నోటీసులపై స్పీకర్ ప్రకటన: వాయిదా

 

 

 

సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం తనకు అందిందని లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ సభలో ప్రకటించారు. సీమాంధ్రకు న్యాయం చేయాలంటూ ఎంపీలు వెల్ లోకి పలు మార్లు దూసుకెళ్లి లోక్ సభ సమావేశాలకు ఆటంకం కలిగించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చకు స్పీకర్ అనుమతించే సరికి మరోసారి సభలో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలోనే సభను స్పీకర్ రేపటికి వాయిదా వేశారు.

 

సభ్యులు ఆర్డర్ లో లేకపోవడం, సభలో నినాదాలు హోరెత్తుతున్న నేపథ్యంలో సభ వాయిదా వేశారు. స్పీకర్ ముందు ఇప్పుడు రెండు అవిశ్వాస తీర్మానాలున్నాయి. ఈ రెండింటిలో ఒకటి భారతీయ జనతాపార్టీ స్పీకర్ మీద అవిశ్వాసం పెట్టారు. రెండోది సీమాంధ్ర ఎంపీలు పెట్టిన అవిశ్వాసం. సీమాంధ్ర ఎంపీల అవిశ్వాసానికి తగినంత సభ్యుల బలం లేని నేపథ్యంలో బీజేపీ పెట్టిన అవిశ్వాసమే మొదట చర్చకు వస్తుందని భావిస్తున్నారు.