TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

త్రిషాకు సారీ.. దిగొచ్చిన తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు

Published on: Tue Feb 17, 2026 9:58AM

టీవీకే అధ్యక్షుడు విజయ్‌ ను విమర్శించే క్రమంలో నటి త్రిష పై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపడంతో బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు నయినార్ నాగేంద్రన్ క్షమాపణలు కోరారు. ఎవరినీ బాధ పట్టే ఉద్దేశం తనకులేదని, పొరపాటున ఈ వ్యాఖ్యలు చేశానని, అందుకు చింతిస్తున్నానన్నారు. సోమవారం  (ఫిబ్రవరి 16) మీడియాతో మాట్లాడిన నయినార్ నాగేంద్రన్.. మాట్లాడుతూ, తన రాజకీయ జీవితంలో ఎప్పుడూ వ్యక్తిగత ఆరోపణలు చేయలేదని చెప్పుకొచ్చారు.

అయితే ఆ రోజు తాను ఆ నిబంధనను అత్రికమించానని పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. దీనిపై వివాదం రేగడంతో బీజేపీ కోయంబత్తూరు ఎమ్మెల్యే వనతి శ్రీనివాస్, పార్టీ రాష్ట్ర శాఖ మాజీ అధ్యక్షుడు కె.అన్నామలై తనతో ఈ విషయం చర్చించారని, తాను అన్న మాటలకు చింతిస్తున్నానని నాగేంద్రన్ తెలిపారు. సొంతంగా పార్టీని ప్రారంభించి ఎన్నికల్లో పోటీ చేయగలరా అంటూ విజయ్ విసిరిన సవాలుపై నాగేంద్రన్‌ను మీడియా ఇటీవల ప్రశ్నించింది. దీనిపై ఆయన వెంటనే స్పందిస్తూ, విజయ్‌కు అనుభవం లేదని, ముందు త్రిష ఇంటి నుంచి బయటకు వచ్చి తన కుటుంబంతో అనుబంధం కలిగి ఉండాలంటూ వ్యాఖ్యలు చేశారు.దీంతో  రాజకీయ దుమారం రేగింది. బీజేపీ నైజం ఏమిటో నాగేంద్రన్ మాటలను బట్టే చెప్పవచ్చంటూ డీఎంకే విమర్శలు గుప్పించింది.

కాగా, నాగేంద్ర వ్యాఖ్యలను త్రిష తరఫున న్యాయవాది తప్పుపట్టారు. బాధ్యత కలిగిన హోదాలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడతారని తాను ఊహించలేదంటూ త్రిష స్పందనను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. తన క్లయింట్‌కు రాజకీయాలతో ఎలాంటి సంబంధం లేదని, నటనకే పరిమితమని, సంబంధం లేని వ్యహహారాల్లో ఆమెను లాగవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలో నాగేంద్రన్ తన వ్యాఖ్యలకు చింతిస్తున్నట్టు ప్రకటించారు.