Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బీహార్ బిజెపిలో ముసలం
posted on: Jul 22, 2013 12:15PM

బీహార్‌లో బిజెపికి మరో ఎదురుదెబ్బ తగలనుంది.. నరేంద్రమోడి అభ్యర్ధిత్వంతో అలిగి పార్టీకి దూరమైన జెడియు.. బీహార్ బిజెపిని దెబ్బతీసే దిశగా పావులు కదుపుతుంది. ఇప్పటికే పార్టీపై అసంతృప్తిగా ఉన్న పలువురు బిజెపి ఎమ్మెల్యేలతో జెడియు టచ్ ఉన్నట్టుగా సమాచారం..
పార్టీ విదానాలతో పాటు, మాజీ డిప్యుటీ చీఫ్ మినిస్టర్ సుశీల్‌కుమార్ మోడి వైఖరితో అసంతృప్తిగా ఉన్న పలువురు బిజెపి ఎమ్మెల్యేలు పార్టీని వీడే ఆలోచనలో ఉన్నారు.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న జెడియూ సదరు నేతలతో సంప్రదింపులు మొదలు పెట్టింది.. అయితే ఆ ఎమ్మేల్యేల సంఖ్య ఇంకా అధికారికంగా తెలియకపోయినా దాదాపుగా ఏడుగురు ఈ లిస్ట్ ఉన్నారంటున్నాయి జెడియు వర్గాలు..
సుశీల్‌కుమార్ మోడీ ఎమ్మెల్యే అమర్‌నాథ్ గామి పై చేసిన వ్యాఖ్యలతో మొదలైన సమస్య ఇప్పుడు ఎమ్మెల్యేలు పార్టీని వీడిదాకా వచ్చింది.. ఇప్పటికే గామి పై వేటు వేసిన బిజేపి అధిష్టానం మిగతా నాయకులపై కూడా చర్యలకు రెడీ అవుతుంది.



.jpg)


