TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీజేపీ ఎంపీ మృతి

Published on: Wed Jun 24, 2015 4:03PM

భారతీయ జనతా పార్టీ ఎంపీ దిలీప్ సింగ్ భూరియా మృతిచెందారు.మధ్యప్రదేశ్, రాట్లమ్ నియోజక వర్గానికి చెందిన దిలీప్ సింగ్ భూరియా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గుర్గావ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈయన మృతికి ప్రధాని నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. గిరిజనుల అభివృద్దికి ఎంతగానో కృషిచేసిన భురియాను కోల్పోవడం పార్టీకి ఎంతగానో తీరని లోటని..ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నానని మోది అన్నారు.