మాజీ ఎంపీ కవిత పై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

posted on: Aug 2, 2019 6:13PM

 

 

అమిత్ షా ప్రారంభించిన బీజేపీ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం తెలంగాణ లో గత కొద్ది రోజులుగా సాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా దేవరకొండ లో జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమానికి గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా  కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన అయన టీఆరెస్ పార్టీ పై అలాగే కెసిఆర్ పాలన పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కేవలం మాటల ముఖ్యమంత్రే తప్ప చేతల ముఖ్యమంత్రి కాదని అయన విమర్శించారు. కేసీఆర్ ఎన్నో మాటలు చెప్తారని  కానీ ఒక్కమాట మీద కూడా నిలబడరని అయన అన్నారు. తెరాసకు ఓటేస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పారని కానీ చేశారా అని అయన ప్రశ్నించారు. 

ఇంటికో ఉద్యోగం అని హామీ ఇచ్చారని కానీ ఒక్కరికైనా ఇచ్చారా అంటూ నిలదీశారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత కొడుకుకి ఒక జాబు, అల్లుడుకి ఒక జాబు, కూతురుకి ఒక జాబు ఇలా కుటుంబం మొత్తానికి జాబులు ఇచ్చుకున్నారని ఆరోపించారు. అయితే ఇటీవలే జరిగిన ఎన్నికలలో నిజామాబాద్ లో కెసిఆర్ కుమార్తె కవితకు ఇచ్చిన ఉద్యోగాన్ని ప్రజలు పీకేశారని వ్యాఖ్యానించారు. స్టీరింగ్ పీకేసి అక్కా ఆడుకో అంటూ ప్రజలు పక్కన పెట్టేశారని కవిత ఓటమిపై రాజాసింగ్ సెటైర్లు వేశారు 

తెలంగాణను బంగారు తెలంగాణాగా మారుస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ చివరికి అప్పుల తెలంగాణగా మార్చేశారని విమర్శించారు. అధికారం లోకి వచ్చిన తరువాత రూ.2లక్షల 34వేల కోట్లు అప్పులు చేసి తెలంగాణను అప్పుల ఊబిలో నెట్టేశారని రాజాసింగ్ ఆరోపించారు. ఆ అప్పు తెచ్చి ఎక్కడ ఖర్చు పెట్టావని ప్రశ్నిస్తే జవాబు లేదని, లెక్క పత్రం లేదంటూ ఎద్దేవా చేశారు. తెలంగాణ అప్పు ఆయన కుటుంబంపై కాని, ఆయనపై కానీ లేదని, అది తెలంగాణ ప్రజలనెత్తిపై ఉందని చెప్పుకొచ్చారు.

 

google-ad-img
    Related Sigment News
    • Loading...