Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...వచ్చారు.. తప్పులో కాలేసారు!
posted on: Jul 4, 2022 11:15AM
అంతా తరలివచ్చారు. యుద్ధానికి సిద్ధపడేందుకు శిబిరాల్లో సేదదీరారు. ఆనక విపక్షాలవారిని, కొలువు దీరిన ప్రాంతీయులను తమ ఆధిపత్య సత్తాను త్వరలో మరింత చవిచూపిస్తామని చిన్నపాటి హెచ్చరి కలు చేసి వెళ్లారు. ఇంతే జరిగింది బిజెపి కార్యవర్గ సమావేశం హడావుడి మొత్తం.
తెలంగాణాలో పాగా వేయడానికి అనేక మార్గాలు, ఆలోచనలు చేసిన బిజెపి కేంద్ర నాయకులు తెలంగాణా రాజధాని హైదరాబాద్‌లోనే తమ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించి ఇక్కడే అసలు సంగతి తేల్చుకుందామని భావించారు. ప్రచారం నుంచి సమావేశం జరిగినంత వరకూ బిజెపి వర్గీయులు నానా హడావుడీ చేసేరు. ప్రధాని మోదీ, పార్టీ సీనియర్ నాయకులు అమిత్ షా తదితరులు, బిజెపి పాలిత రాష్ట్రా ల ముఖ్యమంత్రులతో సహా హైదరాబాద్‌లో మకాం వేసి ఇక్కడి టిఆర్ ఎస్ శ్రేణులకు వెన్నులో వొణుకు పుట్టేలా చేద్దామనుకున్నారు. అయితే టిఆర్ ఎస్ ప్రచారంలోనే ఎదురుదాడికి దిగి వారిని ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న పెద్ద సంకేతమే ఇచ్చింది.
బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశంలో ప్రధాని మోదీ సైతం తెలంగాణాకు ఎంతో చేశామని, ఎంతో ఇచ్చా మని గొంతు చించుకున్నారు. కానీ అవన్నీ అవాస్తవాలేనన్నది వారికి తెలిసేలా టిఆర్ ఎస్ నాయకులు టీ వీ చర్చల్లో ఘాటుగా విమర్శించారు. ప్రధాని మాట్లాడుతున్నంతసేపూ, ఈయన ప్రధానేనా, ఇంత అబద్ధా ల కోరేమిటా అని నోరెళ్లబడుతున్నారు. తెలంగాణాలో టిఆర్ ఎస్ చెప్పుకుంటూన్న అభివృద్ధి అంతా తమ ఆర్ధిక మద్దతుతోనే సాధ్యపడిందని అది టిఆర్ ఎస్ నేతలకు చెప్పుకోవడానికి ఇబ్బందిగా మారిం దనే విమర్శలు గుప్పించారు. తాము నగరాభివృద్ధికి, ముఖ్యంగా రోడ్లు, ఫ్లైఓవర్ల నిర్మాణానికి వేల కోట్లు ఇచ్చామని మైకులు బద్దలయ్యేలా అరిచి మరీ చెప్పారు.
కానీ ప్రధాని చెప్పినంత మాత్రాన అది నిజమై పోతుందా అన్న ప్రశ్న టిఆర్ ఎస్ శ్రేణులు సంధిస్తున్నారు. ప్రధాని మోదీ, కేంద్ర నాయకులు ఎవరయి నా సరే తెలంగాణా గురించి చెప్పినవన్నీ అవాస్తవాలేనని తెలంగాణా ప్రభుత్వం మండిపడుతోంది.
ఎవరు ఎవరిని ప్రశ్నిస్తున్నారు, ఎవర్ని హెచ్చరిస్తున్నారన్నది ప్రజలు గమనిస్తున్నారు. తెలంగాణావా దులు కేంద్రం నిస్సిగ్గుగా అబద్ధాలాడటం పట్ల ఆశ్చర్యపడుతోంది. ఏ ప్రాజెక్టుకీ, రోడ్డు పనులకీ కేంద్రం వీసమెత్త సాయం చేయలేదు, ఇవ్వాల్సినవాటి సంగతి దేవుడెరుగు అంటున్నారు. కేవలం పెద్ద నోరు వేసుకుని అమాంతం ప్రజల సమక్షంలో మైకుల్లో మాట్లాడగానే అన్నీ అందరూ నమ్మరు. ప్రధాని స్థాయి మనిషి మరీ ఇంత అనాలోచితంగా వ్యవహరించడం ఏ పాటి న్యాయమన్నది టి ఆర్ ఎస్ వర్గీయుల ప్రశ్న. వాస్తవానికి తెలంగాణాకు సంబంధించి రావాల్సిన ఆర్దిక మద్దతు గురించి అడిగినవి నిర్లక్ష్యం చేసి తమకు తోచిన అంకెలతో తోచిన విధంగా ప్రచారం చేసుకోవడంలో బిజెపివారీ మానసిక బలహీనతే బయటపడుతోంది.
మొత్తానికి బిజెపి యావత్ సైన్యం వచ్చి చేసిన తప్పుడు ప్రచారాలు, ఊకదంపు ప్రసంగాల వల్ల తెలంగా ణాకు, టిఆర్ ఎస్‌కు వచ్చే నష్టం శూన్యం. ప్రతిగా బిజెపీ వర్గాలే నష్టపోయే అవకాశాలున్నాయి. తెలం గాణా ఏర్పాటయినప్పటి నుంచి కేంద్రం పెద్దగా సహకరించిందేమీ లేదని, ఇపుడు మరింత రాజకీయ వైఫల్యాన్ని బిజెపీ స్వయంగా ఇంత దూరం వచ్చి తెలంగాణాలో బయటపడటం పట్ల అంతా నవ్వుకుం టున్నారు. తెలంగాణాకు చెంద కిషన్ రెడ్డి, బండి సంజయ్ తదితర బిజెపీ హేమాహేమీలు మోదీని, అమిత్ షాను, ఇతర కాషాయ హేమాహేమీలతో వచ్చి రెండు రోజల్లో ప్రజల్ని ముఖ్యంగా ఓటర్లను తమ జండా నీడలోకీ తెచ్చేసుకోవాలన్న ఆతృత విజయవంతం అయితే కాలేదు. ఢిల్లీలో పెట్టుకుని తమ పార్టీ వారు భవిష్యత్ కార్యక్రమాలు నిర్ణయించుకుంటే అయిపోయేదానికి ఇక్కడికి వచ్చి ఇక్కడ శిబిరాలు వేసు కుని, ఇక్కడ తిండి తినగానే తెలంగాణా వాదులు అయిపోతారా ? ఇలాంటి ట్రిక్కులు, జిమ్మిక్కులు తెలంగాణా ప్రజలు అంతగా పట్టించుకోరు. బిజెపీ ఆటపాటలు, హడావుడీ అంతా బీహార్, పంజాబ్, రాజ స్థాన్ లలో చెల్లుతుందేమోగాని తెలంగాణా వాదులను కదిలించలేదు.
బిజెపి పాలిత రాష్ట్రాలతో పోలుస్తూ తెలంగాణా కూడా తమ నీడలోకి తెచ్చేసుకోవడానికి ఇంక ఆట్టే కాలం పట్టదు, రెడీగా వుండడని ఎవరికి హెచ్చరికలు జారీచేస్తున్నారు? తెలంగాణా పోరు, రాష్ట్రావతరణ వెనుక అనేక శతాబ్దాల వెతలు వున్నాయి. ఈ ప్రజలు ఇతర రాష్ట్రాల్లో వలె అంత త్వరగా కాషాయం వారి జాతీయ భావన, అతి దేశ భక్తి ఓవరాక్షన్‌లకు పడరు. టిఆర్ ఎస్ ప్రస్తుతం బిజెపి దృష్టిలో తక్కువ స్థాయిలో కన పడుతోందేమోగాని టిఆర్ ఎస్‌కి రాష్ట్రంలో ప్రజల్లో ఏమాత్రం గౌరవం, నమ్మకం సడలలేదు. కట్టగట్టుకుని వచ్చాం, భయపెట్టి పోయామని బిజెపి వర్గాలు అనుకుంటే తప్పకుండా తప్పులో కాలేసినట్టే!


.webp)



