Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కోవర్టు ఎవడో కానీ.. ఎర్రి పప్పను చేశాడు
posted on: Jul 20, 2020 2:40PM
మూడు రాజధానుల బిల్లు పై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కు ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ లేఖ రాయడం పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. "కన్నా లక్ష్మీనారాయణ చంద్రబాబు కోవర్టు అని మళ్లీ స్పష్టమైంది. సొంత పార్టీ అభిప్రాయానికి వ్యతిరేకంగా చంద్రబాబుకి అనుకూలంగా రాజధాని బిల్లు ఆమోదించవద్దని గవర్నర్ గారికి లేఖ రాశారు. దీనితో పార్టీ అధిష్ఠానం ఆగ్రహానికి కూడా గురయ్యాడు. ఇంకా ఎన్నాళ్లు ఈ ముసుగు కన్నా?" అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.
అయితే, విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలను పలువురు బీజేపీ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. తాజాగా, బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యుడు రామ్ కుమార్ యార్లగడ్డ ట్విట్టర్ వేదికగా విజయసాయికి కౌంటర్ ఇచ్చారు. "మా పార్టీలో ఉన్న కోవర్టు ఎవడో కానీ నీకు తప్పుడు సమాచారం ఇచ్చి.. ఎర్రి పప్పను చేశాడు" అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఇవన్నీ తప్పుడు కథనాలు, కేంద్ర పార్టీ సమాధానమిదేనని ఆయన ట్వీట్ ద్వారా స్పష్టం చేశారు.


.jpg)



