జర్నలిజం అప్పుడే ప్రారంభమైంది... మరో బీజేపీ నేత

posted on: May 31, 2018 4:21PM

 

ఈ మధ్య బీజేపీ ఎమ్మెల్యేలు మహాభారతం లో ఇంటర్నెట్ అంటూ అప్పట్లోనే శాటిలైట్‌ కమ్యూనికేషన్లు అంటూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ బుక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఇటీవలే త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్‌.. మహా భారతం కాలంలో ఇంటర్నెట్‌, శాటిలైట్‌ కమ్యూనికేషన్లు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఇక ఆ తరువాత..  బీజేపీ రాజస్థాన్‌ ఎమ్మెల్యే జ్ఞాన్‌దేవ్ అహుజా హనుమానంతుడు ప్రపంచంలోనే తొలి ఆదివాసి అని అన్నారు. ఇక ఇప్పుడు మరో బీజేపీ నేత ఇలాంటి వ్యాఖ్యలే చేసి ఆ జాబితాలో చేరిపోయారు. హిందీ జర్నలిజం డే'  ఉత్తరప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి దినేష్ శర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ...జర్నలిజం, ప్రత్యక్ష ప్రసారాలు అనేవి మహాభారత కాలంలోనే ప్రారంభమయ్యాయని...దృతరాష్ట్రుడి రథ చోదకుడు సంజయ్‌.. హస్తినాపురంలో ఉండే కురుక్షేత్రంలో జరుగుతున్న యుద్ధం గురించి దృతరాష్ట్రుడికి వివరించాడని...మరి ఇది లైవ్ టెలికాస్ట్ కాకపోతే మరేంటని విచిత్ర ప్రశ్న వేశారు. అలాగే, సెర్చ్‌ ఇంజన్‌ గూగుల్‌ అనేది ఇప్పుడు ప్రారంభమైంది కానీ, నారద ముని ఆ కాలంలోనే సమాచారాన్ని చేరవేయడంలో సిద్ధహస్తుడని సదరు మంత్రి అన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...