Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...కొడాలి నానిని క్యాబినెట్ నుండి బర్తరఫ్ చేయాలి!!
posted on: Nov 19, 2019 4:37PM

మంత్రి కొడాలి నానిని క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. తిరుమల ఆలయం పై మంత్రి నాని అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు బీజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. శ్రీ వారి భక్తుల మనోభావాలు దెబ్బతినేలా మాట్లాడిన మంత్రి నాని పై చర్యలు తీసుకోవాలంటూ.. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. అన్యమతస్థులు తిరుమల శ్రీ వారి దర్శనానికి వచ్చినపుడు డిక్లరేషన్ ఇవ్వాలన్న చట్టం కాపీలను ఆయన పోలీసులకు అందజేశారు. మంత్రి నాని పై కేసు నమోదు చేయకపోతే కోర్టును ఆశ్రయిస్తామని భానుప్రకాశ్ రెడ్డి ప్రకటించారు. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక అయిన తిరుమల తిరుపతి దేవస్థానాల్లో గుడికి కానీ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తానంటే అన్యమతస్థులు డిక్లరేషన్ ఇవ్వాలని.. గుడిని చట్టాల్ని అగౌరపరిచే విధంగా రాష్ట్ర మంత్రివర్యులు కొడాలి నాని గారి వ్యవహార శైలి కోట్లాది మంది హిందువుల మనోభవాలు కించపరిచేలా ఉందని ఆయన తెలియజేశారు.
అయ్యా నాని గారు మీరు మాట్లాడే భాష కోట్లాది మంది శ్రీవారి భక్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. కాబట్టి వెంటనే మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసారు. మీరు మాట్లాడిన పదాలు కూడా నేను ఇక్కడ మాట్లాడలేనని.. కానీ భక్తులందరికీ తెలిసిరావాలని.. గౌరవ మంత్రిగా ఉండి మీరు మాట్లాడిన మాటలు 'నీ అమ్మ మొగుడు కట్టాడా తిరుపతి గుడిని' అని ఎలా సంభోదించారు. ఒకసారి తిరుమల ఆలయ చరిత్ర తెలుసుకోండి. కొన్ని దశాబ్దాల క్రితం శతాబ్దాల క్రితం చోళులు పల్లవులు, విజయనగర సామ్రాజ్య చక్రవర్తులు వీరందరూ స్వామి మీద ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్మించినట్టి ప్రసిద్ధమైన ఆలయం తిరుమల. ఈ రోజు కలియుగ వైకుంఠంగా ఉన్నటువంటి ఈ ఆలయం పట్ల ఆలయంలో ఉన్న వ్యవహారాల పట్ల మీరు వ్యాఖ్యానించిన మాటలని వెనక్కి తీసుకొని వెంటనే క్షమాపణ చెప్పాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ఇలా హిందువుల మనోభావాలను గాయపరిచిన కొడాలి నానిని వెంటనే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయవలసిందిగా బీజేపీ డిమాండ్ చేస్తుందని తెలిపారు. హిందువులు కాకపోతే డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పి గెజిట్ ఉంది. దీనికి కూడా చట్టం ఉంది.. చట్టాన్ని కూడా గమనించకపోతే ఎలా అంటూ ఘాటుగా స్పందించారు.






