నువ్ రెండుసార్లు సీఎం.. నేను నాలుగుసార్లు సీఎం.. బీజేపీ అంటే బిర్యానీ కాదు కేసీఆర్‌

posted on: Jan 7, 2022 3:47PM

సీఎం కేసీఆర్‌కు క‌మ‌ల‌నాథులు ఖ‌త‌ర్నాక్ షాక్ ఇచ్చారు. సీఎంకు సీఎంతోనే బ‌దులు చెప్పించారు. బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్‌ను జైల్లో పెట్ట‌డంపై కాషాయ‌ద‌ళం భ‌గ్గుమంది. కేసీఆర్ సంగ‌తి ముందుముందు తేలుస్తామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాయి బీజేపీ శ్రేణులు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పిరికివాడని.. ఇలాంటి సీఎంను తానెక్కడా చూడలేదని మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. విపక్షాలు లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందని.. కానీ తెలంగాణలో ఆ పరిస్థితి కనిపించడం లేదన్నారు. ఉద్యమిస్తే భయపడి.. అక్రమంగా, దౌర్జన్యంగా అరెస్టు చేసి జైల్లో వేస్తున్నారని మండిపడ్డారు. 

మీ బెదిరింపులకు భయపడే పార్టీ కాదు బీజేపీ.. కేసీఆర్‌కు కలలో కూడా బండి సంజయ్‌ గుర్తొస్తున్నారన్నారు శివ‌రాజ్‌సింగ్ చౌహాన్‌. ఈ సంద‌ర్భంగా తెలంగాణ సీఎంపై మ‌ధ్య‌ప్ర‌దేశ్ సీఎం ఘాటైన వ్యాఖ్య‌లు చేశారు. "కేసీఆర్.. నేను కూడా సీఎంనే. నువ్వు రెండోసారి సీఎం కావొచ్చు.. నేను నాలుగోసారి సీఎం. అయినా, మీలాగా సంస్కార హీనంగా వ్యవహరించడం లేదు. బీజేపీ అంటే బిర్యానీ అనుకున్నారా?" అంటూ మండిప‌డ్డారు శివ‌రాజ్‌సింగ్‌. 

"డబుల్ బెడ్‌ రూం ఇళ్లు, నిరుద్యోగ భృతి, కేజీ టు పీజీ ఉచిత విద్య ఏమైంది? వీటికి జవాబు ఎందుకు ఇవ్వడం లేదు? తెలంగాణలో ధర్మయుద్దం మొదలైంది. అవినీతి-నియంత-కుటుంబ పాలనను అంతం చేసేందుకు బీజేపీ నేత‌లు చేస్తున్న పోరాటం అభినందనీయం. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చి తీరుతుంది." అని సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ అన్నారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...