వైసీపీ వారికి అన్నీ తడిసిపోతాయ్! బీజేపీ నేత స్ట్రాంగ్ వార్నింగ్.. 

posted on: Jan 5, 2022 11:16AM

ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మధ్య కొన్ని రోజులుగా డైలాగ్ వార్ సాగుతోంది. గతంలో జగన్ సర్కార్ పై పెద్దగా మాట్లాడని ఏపీ కమలం నేతలు.. అమిత్ షా తిరుపతి పర్యటన తర్వాత కొంత స్పీడ్ పెంచారు. జగన్ రెడ్డి పాలనపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. గుంటూరు జిన్నా సెంటర్ ను మార్చాలని డిమాండ్ చేస్తున్ బీజేపీ నేతలు... వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు బీజేపీ ముఖ్య నేత. 

గుంటూరులో జిన్నా టవర్‌తో పాటు విశాఖ కేజీహెచ్ పేరు కూడా మార్చాలని బీజేపీ ఏపీ  అధ్యక్షుడు సోము వీర్రాజు  డిమాండ్ చేశారు. పేర్లు మార్చేవరకు వదిలిపెట్టే ప్రకస్తే లేదన్నారు. ఇకపై జగనన్న కాలనీలను మోడీ కాలనీలుగా మారుస్తామని.. ఎవరొస్తారో చూస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం పేర్లు మార్చుకుని ప్రచారం చేసుకుంటోందన్నారు. మా బొమ్మలు వేస్తే వైసీపీ వారికి అన్ని తడిసిపోతాయని సోము వీర్రాజు వార్నింగ్ ఇచ్చారు. 

రైతు భరోసా కేంద్రాల ఏర్పాటులో కేంద్రం ముఖ్య పాత్ర పోషించిందన్నారు సోము వీర్రాజు. 2 వేల కోట్లతో గ్రామీణ రోడ్లు కూడా సీఎం జగన్ రెడ్డి వేయలేకపోతున్నారని ఎద్దేవా చేశారు. తాము వేల కోట్లతో జాతీయ రహదారులు నిర్మాణం చేస్తున్నామని సోము వీర్రాజు వెల్లడించారు. కేంద్ర పథకాలను తమ ఖాతాలో వేసుకుంటూ జగన్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని సోము వీర్రాజు విమర్శించారు. 

google-ad-img
    Related Sigment News
    • Loading...