Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బీజేపీ యాత్రలు!
posted on: Nov 2, 2013 7:04PM
_1.jpg)
కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ చుట్టూ కాంగ్రెస్ నాయకులు ప్రదక్షిణలు చేస్తూ వుండటం ఎప్పుడూ చూసే విషయమే! తెలంగాణ ఇష్యూ విషయంలో కాంగ్రెస్ నాయకుల ఢిల్లీ యాత్రలు ఏ స్థాయిలో వుంటాయో అందరికీ తెలుసు. ఇప్పుడు కాంగ్రెస్ తరహా యాత్రలు రాష్ట్ర బీజేపీ నాయకులు చేస్తున్నారు. ప్రస్తుతం అటు తెలంగాణ బీజేపీ నాయకులు, ఇటు సీమాంధ్ర బీజేపీ నాయకులు ఢిల్లీలో పార్టీ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. శనివారం నాడు తెలంగాణ బీజేపీ నాయకులు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజ్‌నాథ్ సింగ్ దగ్గరకి వెళ్ళి తెలంగాణ ప్రజల పక్షాన మాట్లాడారు. మరోవైపు సీమాంధ్ర బీజేపీ నాయకులు మాజీ అధ్యక్షుడు మురళీ మనోహర్ జోషిని కలిశారు. విభజన సందర్భంగా సీమాంధ్రకు అన్యాయం జరక్కుండా చూడాలని ఆయనతో మొరపెట్టుకున్నారు. తెలుగుజాతి పరువుని ఢిల్లీ పెద్దల పాదాల దగ్గర పెట్టే సంస్కృతి బీజేపీలో కూడా పెరుగుతోంది.


.jpg)
.jpg)


