విద్యార్థుల మరణాలపై నీచ రాజకీయాలు చేస్తున్నబీజేపీ

 

బీహార్ లో నిన్న ఒక ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించడంతో 20మంది చిన్నారులు చనిపోగా, మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది. హృదయవిదారకమయిన ఈ సంఘటనకి ఎటువంటి వ్యక్తులయినా చలించకమానరు. కానీ, ఈ ఘోర దుర్ఘటనకు మానవత్వంతో స్పందించవలసిన రాజకీయ పార్టీలు మాత్రం ఇదే అదునుగా తీసుకొనినితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రయత్నిస్తున్నాయి. 

 

(యు)పార్టీ నితీష్ కుమార్ ఒత్తిడి కారణంగా ఎన్డీయే నుండి విడిపోయిన తరువాత ఇప్పుడు క్రమంగా కాంగ్రెస్ పార్టీకి చేరువవుతుండటంతో రగిలిపోతున్న బీజేపీ ఇదే అదునుగా భావించి శరన్ జిల్లా బందుకు పిలుపునిచ్చింది. అదేవిధంగా నితీష్ చేతిలో ఓడిపోయి అధికారం కోల్పోయిన బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ కూడా చిరకాలంగా ఇటువంటి అవకాశం కోసమే ఓపికగా ఎదురు చూస్తున్నాడు. ఆతని ఆర్.జే.డీ. పార్టీ కూడా ఈ రోజు చప్రా మరియు శరన్ జిల్లాల బంద్ కు పిలుపునిచ్చింది.

 

లాలూ ప్రసాద్ యాదవ్, బీజేపీ రెండూ కలిసి నితీష్ కుమార్ ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకు పడుతూ ఈ సంఘటనకు బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖా మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.