కాకినాడలో చంద్రబాబుకు చేదు అనుభవం

posted on: Jan 4, 2019 11:29AM

 

కాకినాడలో ఏపీ సీఎం చంద్రబాబుకి చేదు అనుభవం ఎదురయ్యింది. ‘జన్మభూమి- మా ఊరు’ కార్యక్రమానికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. కాకినాడ నాగమల్లితోట జంక్షన్‌ వద్ద చంద్రబాబు కాన్వాయ్‌ను భారతీయ జనతా పార్టీ నేతలు అడ్డుకున్నారు. సీఎం డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. దీంతో వారిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. కాన్వాయ్‌ను అడ్డుకున్న భాజపా నేతలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘లేనిపోని ప్రాబ్లమ్స్‌ తెచ్చి పెట్టుకోవద్దు. పెట్టుకుంటే మీరు ఫినిష్‌ అయిపోతారు. బయటకు వస్తే మిమ్మల్ని పబ్లిక్‌ వదిలి పెట్టరు. మర్యాదగా ఉండు. చాలా సమస్యలు వస్తాయి నీకు. వెళ్లమ్మా వెళ్లు’  అంటూ బీజేపీ మహిళా నేతను హెచ్చరించారు. రాష్ట్రానికి మోడీ ఏంచేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉండేందుకు భాజపా నేతలకు అర్హత లేదన్నారు. రాష్ట్రానికి మోడీ చేసిన అన్యాయాన్ని మీరు సమర్థిస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రాన్ని, దేశాన్ని మోడీ ముంచేశారని విమర్శించారు. అనంతరం కార్యక్రమం సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...