TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎయిర్ ఇండియా ఫ్లైట్ ను ఢీ కొన్న పక్షి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

Published on: Fri Jun 20, 2025 6:40PM

ఎయిర్ ఇండియా విమానాలను ప్రమాదదాలు వెంటాడుతున్నాయా అనిపించేలా వరుస సంఘటనలు జరుగుతున్నాయి.   తాజాగా ఎయిర్ ఇండియా విమానం ఏ12479 ను ఓ పక్షి ఢీ కొంది. దీంతో అప్రమత్తమైన పైలట్ ఆ విమానాన్ని అత్యవసరంగా పూణెలో ల్యాండ్ చేశారు.  శుక్రవారం (జూన్ 20)   పూణే నుండి ఢిల్లీకి  వెడుతున్న విమానాన్ని పక్షి ఢీ కొనడంతో దానిని పూణె విమానాశ్రయంలోనే అత్యవసరంగా ల్యాండ్ చేశారు.

ఆ తరువాత ఆ విమానాన్ని రద్దు చేశారు. ఈ విషయాన్ని ఎయిర్ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక ఆ విమానంలోని ప్రయాణీకులను ఢిల్లీకి పంపించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఎయిర్ ఇండియా తెలిసింది.  ప్రయాణీకులను ఢిల్లీకి తీసుకెళ్లడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు.

 మరోవైపు   ఎయిర్ ఇండియా జూన్ 21 మరియు జూలై 15 మధ్య 16 అంతర్జాతీయ విమాన మార్గాల్లో విమానాలను తగ్గిస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది. అలాగే మూడు మార్గాల్లో అంతర్జాతీయ విమాన సర్వీసులను ఎయిర్ ఇండియా రద్దు చేసింది,