అతి సాధారణ జీవితాన్ని గడుపుతున్న బిలియనీర్లు

ప్రపంచంలోనే సంపన్నుల జాబితాలో వారి పేర్లు నమోదు అయ్యాయి.. అయినా వారి జీవనశైలీ
అతి సాధారణంగా ఉంటుంది. వందలాది కోట్ల రూపాయలకు అధిపతులు అయ్యినప్పటికీ స్మార్ట్ ఫోన్ ఉపయోగించని వారెన్ బఫెట్ లాంటి వ్యాపారదిగ్గజాలు ఉన్నారు.

1. వారెన్ బఫెట్

బెర్క్‌షైర్ హాత్‌వే ఛైర్మన్,  సి.ఏ.ఓ వారెన్ బఫెట్.  అయినప్పటికీ, అతను పాత ఇంట్లోనే ఉంటున్నాడు. ఆ ఇంటిని అతను 1958 లో 31,500  డాలర్లకు కొన్నాడు. అతన్ని ఒరాహా ఆఫ్ ఒరాకిల్ అని కూడా పిలుస్తారు. చాలా సున్నితమైన వ్యాపారవేత్తగా ప్రసిద్ది చెందాడు. ఇప్పటికీ అతని వద్ద, స్మార్ట్ ఫోన్‌ ఉండదు. డెస్క్ పైన కనీసం కంప్యూటర్ లేదు. అతను ఎప్పుడు చెప్పే మాట  స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ వంటి ఆధునిక పరికరాలు ఉంటే నా జీవితం సంతోషంగా ఉండదు. నిజానికి, నాకు ఆరు లేదా ఎనిమిది ఇళ్ళు గానీ ఉండి ఉంటే మరింత దారుణంగా నా పరిస్థితి ఉండేది. ప్రస్తుతం నాకు అవసరం ఉన్న ప్రతిదీ నా దగ్గర ఉంది, నాకు ఇంకేమీ అవసరం లేదు. ఎందుకంటే  దీని తర్వాత పెద్దగా తేడా ఏం ఉండదు కాబట్టి.

2. మార్క్ జుకర్‌బర్గ్.

అతను  ఫేస్బుక్ స్థాపకుడు. ఆ సంస్థకు   సిఇవో కూడా అయిన అతను ఇప్పటికి వోక్స యాగన్ హ్యాచ్ బ్యాక్ను నడుపుతాడు. తను ఈ భూమి మీద ఉన్న అత్యంత ధనవంతుడైన టెక్ మొగల్స్‌లో ఒకరు అయినప్పటికీ తన భార్య, కుమార్తెతో కలిసి చాలా సాధారణం జీవితాన్ని గడుపుతున్నాడు.  ఒక మాములు టీ-షర్టు, హూడీ జీన్స్ మాత్రమే ధరిస్తూ ఉంటాడు.  'నేను నా జీవితం గురించి స్పష్టం చేయాలనుకుంటున్నాను, సాధ్యమైనంత తక్కువ నిర్ణయాలు తీసుకోని తద్వారా ఈ సమాజానికి ఎలా ఉత్తమంగా సేవ చేయాలనే దాని గురించే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను అంటాడు  జుకర్‌బర్గ్.

3. కార్లోస్ స్లిమ్ హెలు.

తను గ్రూపో కార్సో స్థాపకుడు. గత  40 సంవత్సరాలుగా A 6 బెడ్ రూమ్ ఇంటిలోనే నివసిస్తున్నాడు. మెక్సికోలో ఇప్పటికీ అత్యంత ధనవంతుడు ఇతనే. అయితే ఇతర సంపన్నుల మాదిరిగా ప్రయివేటు  విమానాలు, పడవలు ఆయనకు లేవు. ఇప్పటికీ పాత మెర్సిడెజ్ లోనే తిరుగుతూ ఉంటాడు. తన కంపెనీని కూడా చాలా పొదుపుగా నడుపుతూ ఉన్నాడు. అతను తన స్టాఫ్ హ్యాండ్‌బుక్స్‌లో 'సంపన్న
సమయాల్లో కూడా కాఠిన్యాన్ని కొనసాగించమని రాశాడు.

4. చార్లీ ఎర్గెన్

అతను డిష్ నెట్‌వర్క్ చైర్మన్ అయినా కూడా ఇప్పటికీ ప్రతిరోజూ బ్రౌన్ పేపర్ బ్యాగ్ లో లంచ్ బాక్స్ ప్యాక్ చేసికొని తీసుకెళుతు ఉంటాడు. అతను వ్యాపారంలో  ఎన్నో ఒడిదుడుగులు ఎదుర్కొన్నారు. తన నిజ జీవితంలో విలువైన వ్యక్తిత్వం కలిగి ఉన్నాడు. అతని పొదుపు లక్షణాలు బాల్యంలో అతని తల్లి
నుండి వచ్చాయి. కఠినమైన సమయాల్లో పెరిగినప్పుడు అతనికి జీవితం చాలా నేర్పింది. కార్లోస్ తన సహచరులతో కలిసి ప్రయాణించేటప్పుడు హోటల్ గదులను కూడా  తన వారితో కలిసి షేర్ చేసుకుంటారు.

5. అమన్సియో  ఒర్టెగా.

అతను  ఇండిటెక్స్ స్థాపకుడు; ప్రతి రోజు భోజనాన్ని తన ఉద్యోగులతో కలిసే కేఫ్ టెరియాలో చేస్తాడు. చాలా నిశ్శబ్ద జీవితాన్ని గడిపే అతను, తరచూ అదే కాఫీ షాప్‌కు వెళ్తూ ఉంటాడు. అతను పరిచయం అవసరం లేని జారా అనే బ్రాండ్ స్థాపకుడు. ఇటీవల భూమిపై రెండవ ధనవంతుడిగా పేరు పొందాడు. అతి సాధారణ వ్యక్తి మాదిరిగానే జీవితాన్ని గడుపుతార ఈ జాబితాలోని మరొక బిలియనీర్ జుకర్‌బర్గ్ మాదిరిగానే  ప్రతిరోజూ  బ్లూ బ్లేజర్, వైట్ షర్ట్ , యాష్ కలర్  ప్యాంటు ధరిస్తారు.