TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఓట్ల కోసం నరేంద్ర మోదీ కూడా చేస్తారు : రాహుల్ గాంధీ

Published on: Wed Oct 29, 2025 5:04PM

 

బీహార్ ముజఫర్‌పూర్‌లో ఎన్నికల ప్రచారాన్ని  కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ ప్రారంభించారు. ఈ సందర్బంగా రాహుల్ మాట్లాడుతు ఓట్ల కోసం ప్రధాని మోదీ ఏమైన చేస్తారని..డ్యాన్స్ చేయాలని అడిగితే మోదీ వేదికపైనే డ్యాన్స్ చేస్తారని ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు. చత్ పూజ సందర్బంగా ప్రజలు ఢిల్లీలోని కాలుష్యమైన యమునా నదిలో పూజలు చేసుకుంటున్నారు. కానీ ప్రధాని ప్రత్యేకంగా తయారు చేసిన స్విమ్మింగ్ పూల్‌లో స్నానం చేశారని రాహుల్ విమర్శించారు. 

బీహార్‌లో బీజేపీ నేతలు ఓట్ల చోరీలో నిమగ్నమయ్యారని విమర్శించారు. మహారాష్ట్ర, హర్యానలో ఓట్ల దొంగిలించారని బీహార్‌లోనూ అదే ప్రయత్నిస్తారని అగ్రనేత తెలిపారు. బీజేపీ కేవలం సీఎం నీతీశ్ కుమార్‌ను వాడుకుంటోంది.  దేశసంపద కొంతమంది సంపన్నుల చేతుల్లోకి వెళ్లిపోతోంది. బిహార్‌ వంటి ప్రాంతాలు పేదరికంలో కూరుకుపోవడానికి ఇదే ప్రధాన కారణమని తెలిపారు. నోట్ల రద్దు వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టంపై ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారని రాహుల్ ప్రశ్నించారు.  

మహాగఠ్‌బంధన్‌ అధికారంలోకి వస్తే రూ.500కే వంటగ్యాస్‌ సిలిండర్లు అందజేస్తామని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తెలిపారు. ‘ఇండియా’ కూటమి అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రయోజనాలు కాపాడతామని రాహుల్‌  హామీ ఇచ్చారు. రాజ్యాంగ పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఆధునిక నలంద విశ్వవిద్యాలయానికి కాంగ్రెస్‌ హయాంలోనే నాంది పడిందని విపక్ష నేత తెలిపారు