డ్రగ్స్ కోణంలో రియాను అరెస్ట్ చేసిన ఎన్సీబీ... బలమైన ఆధారాలతోనే అంటున్న బీహార్ డీజీపీ

posted on: Sep 8, 2020 5:25PM

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతి వెనుక డ్రగ్స్ మాఫియా ఉందన్న కోణంలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసులో ఎన్సీబీ అధికారులు కొద్దిసేపటి క్రితం నటి రియా చక్రవర్తిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆమె సోదరుడిని కూడా అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. 

 

దీనిపై తాజాగా బీహార్ డీజీపీ గుప్తేశ్వర్ పాండే స్పందిస్తూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) రియాకు వ్యతిరేకంగా చాలా బలమైన ఆధారాలే సంపాదించినట్టుందని అయన అభిప్రాయపడ్డారు. "రియా నుంచి ఎన్సీబీ అధికారులు బహుశా డ్రగ్స్ కు సంబంధించి పూర్తి సమాచారం రాబట్టి ఉంటారని.. అంతేకాకుండా ఆమెకు డ్రగ్స్ విక్రేతలతో గల సంబంధాలు కూడా కచ్చితంగా వెల్లడై ఉంటాయి. అందుకే ఈ కేసులో డ్రగ్స్ కోణంలో రియా పాత్ర స్పష్టం కావడంతో ఆమెను అరెస్ట్ చేసి ఉంటారు" అని పాండే అభిప్రాయపడ్డారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...