ప్రియాంక గాంధీ అందంపై బీజేపీ మంత్రి కామెంట్స్

posted on: Jan 25, 2019 1:11PM

 

కాంగ్రెస్ పార్టీ ప్రియాంక గాంధీకి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు ఉత్తరప్రదేశ్ తూర్పు ప్రాంతం ఇన్‌ఛార్జ్‌ భాద్యతలను కూడా అప్పగించిన సంగతి తెలిసిందే. కాగా ఇప్పటికే ప్రియాంకకి పదవి కట్టబెట్టటంపై పలువురు బీజేపీ నేతలు విమర్శలు చేయగా..తాజాగా బీహార్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి సుశీల్‌ మోడీ ప్రియాంక గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. "అవినీతి, కళంకిత మనిషి రాబర్ట్ వాద్రా భార్య కాంగ్రెస్‌లో కీలక బాధ్యతలు చేపట్టడం బీజీపీకి లాభిస్తుందని, ప్రియాంకను ఇందిరా గాంధీతో పోల్చడం నవ్వు తెప్పిస్తుంది" అని సుశీల్ వ్యాఖ్యానించారు. 

ప్రియాంకపై మంత్రి వినోద్‌ నారాయణ్‌ ఝా కూడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు."ప్రియాంక అందమైన ముఖం చూసి జనం ఓట్లేయరు. మరో ముఖ్య విషయం ఏంటంటే.. ఆమె భూ కబ్జాలు, అవినీతి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న రాబర్ట్‌ వాద్రా భార్య. ఆమె చాలా అందంగా ఉంటుంది. అంతకుమించి రాజకీయంగా ఆమెకు ఎలాంటి అనుభవం, టాలెంట్‌ లేదు’ అని ఝా వ్యాఖ్యానించారు. కాగా, మంత్రి వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ అభిమానులు,నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...