TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీహార్లో తుఫాను... 30 మంది మృతి

Published on: Wed Apr 22, 2015 3:04PM

 

బీహార్ రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో మంగళవారం అర్ధరాత్రి ఊహించని విధంగా తుఫాను బీభత్సం సృష్టించింది.ఈ పెను తుఫాను ధాటికి భారీగా ఆస్తినష్టం జరిగింది. 30 మంది వ్యక్తులు మరణించారు. ఈదురుగాలుల ధాటికి 80 మంది వరకు గాయపడ్డారు. బీహార్‌లోని పూర్నియా, భాగల్పూర్, మాధేపుర జిల్లాలు ఈ తుఫాను ధాటికి తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ అకాల వర్షాల వల్ల రైతులు భారీగా నష్టపోయారు. ఈ తుఫాను కారణంగా మరణించిన వారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 4 లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియాని బీహార్ ప్రభుత్వం ప్రకటించింది.