Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...పవన్ కల్యాణ్ కు హైకోర్టులో ఊరట!
posted on: Jul 31, 2024 12:47PM
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు హైర్టులో ఊరట లభించింది. గతంలో పవన్ కల్యాణ్ వలంటీర్లపై చేసిన వ్యాఖ్యలపై వైసీపీ హయాంలో కేసు నమోదైంది. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 30 వేల మంది యువతులు అదృశ్యమయ్యారని, వాలంటీర్లు వైసీపీ ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సేకరించిన డేటాయే ఇందుకు కారణమని పవన్ ఆరోపించారు. దీనిపై వాలంటీర్లు చేసిన ఫిర్యాదుపై పోలీసులు పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు చేశారు. ఈ కేసు గుంటూరు కోర్టులో విచారణ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసును క్వాష్ చేయాలని కోరుతూ పవన్ కళ్యాణ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై హైకోర్టు బుధవారం (జులై 31) విచారించింది. అనంతరం కేసును నాలుగు వారాలు వాయిదా వేస్తూ పవన్ కల్యాణ్ పై కేసు గుంటూరులో కేసు విచారణపై స్టే విధించింది.
కాగా ఈ కేసు విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ పవన్ కల్యాణ్ పై కేసు సహా పలు కేసుల నమోదుకు గత ప్రభుత్వం ఇచ్చిన జీవోను ప్రస్తుత సర్కార్ వెనక్కు తీసుకుంటుందని తెలిపారు. గత ప్రభుత్వం అడ్డగోలుగా నమోదు చేసిన పలు కేసులను రివైజ్ చేయాలని ప్రస్తుత సర్కార్ భావిస్తున్నట్లు కోర్టుకు విన్నవించారు.



.webp)


