Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...యూట్యూబర్ అన్వేష్‌పై కేసు నమోదు..ఎందుకంటే?
posted on: May 4, 2025 10:55AM

ప్రముఖ యూట్యూబర్ అన్వేష్‌పై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సుమోటాగా కేసు నమోదు చేశారు. హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ప్రకటనల మీద అన్వేష్ వరుస వీడియోలు చేశారు.ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎఎస్ రెడ్డి, మాజీ సీఎస్ శాంతి కుమారి, ఐఏఎస్‌లు దాన కిషోర్, వికాస్ రాజ్‌లపై అన్వేష్ ఆరోపణలు చేశారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ల ద్వారా రూ.300 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని అన్వేష్ వీడియోలో పేర్కొన్నారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారనే కారణంగా పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. ప్రభుత్వ అధికారులు, చట్టబద్దమైన సంస్థల ప్రతిష్ఠను దెబ్బతీసేలా అన్వేష్ కామెంట్స్ చేశాడని పేర్కొన్నారు.
ఆవాస్తవంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ అన్వేష్‌పై ఓ కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు అన్వేష్‌పై సుమోటోగా పోలీసులు కేసు నమోదు చేశారు. అధికారుల విశ్వాసనీయతను దెబ్బతీసేలా, ప్రభుత్వం మీద వ్యతిరేకతను కలిగించేలా ఈ వీడియో ఉందని కానిస్టేబుల్ ఫిర్యాదు చేశారు. బెట్టింగ్ యాప్‌లపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ యాప్‌లను కొంతమంది సినీ ప్రముఖులు ప్రమోట్ చేశారు. వీరిపై కూడా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే బెట్టింగ్ యాప్‌లు ప్రమోట్ చేసిన వారు ఎంతవారైనా విడిచి పెట్టేది లేదని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది.ఈ నేపథ్యంలోనే బెట్టింగ్ యాప్‌లను హైదరాబాద్ మెట్రోరైలులో ప్రమోట్ చేస్తున్నారని తెలంగాణ హైకోర్టు దృష్టికి పలువురు తీసుకెళ్లారు.






