Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ఈ పండ్లు మూత్రపిండాల ఆరోగ్యానికి గొప్ప వరం..!
posted on: Mar 12, 2026 12:09PM

మూత్రపిండాలు శరీరంలో వడపోత అవయవాలు. ఇవి రక్తాన్ని శుద్ది చేస్తాయి. అలాగే శరీరంలో ద్రవాల నుండి వెలువడే వ్యర్థాలను మూత్రం రూపంలో విసర్జించడానికి సహాయపడతాయి. అయితే నేటి కాలంలో చాలామంది మూత్రపిండాల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కిడ్నీ ఫెయిల్యూర్, మూత్రనాళ ఆరోగ్యం దెబ్బతినడం, కిడ్నీలలో రాళ్లు..ఇలా మూత్రపిండాలకు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. మూత్రపిండాల ఆరోగ్యం బాగుండాలన్నా, వాటి పనితీరు మెరుగ్గా ఉండాలన్నా కొన్ని పండ్లు చాలా బాగా సహాయపడతాయి. ఈ పండ్లు మూత్రపిండాల ఆరోగ్యానికి వరం అని చెప్పవచ్చు. ఆ పండ్లు ఏమిటో.. ఆ పండ్లు మూత్రపిండాల ఆరోగ్యానికి ఎందుకు సహాయపడతాయో తెలుసుకుంటే..
బెర్రీస్..
బ్లూబెర్రీలు, స్ట్రాబెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే పొటాషియం తక్కువగా ఉంటుంది. ఇది ఆక్సీకరణ ఒత్తిడి నుండి రక్షిస్తుంది. మూత్రపిండాల ఆరోగ్యానికి మంచివి.
చెర్రీస్..
చెర్రీస్ ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కోవడానికి, ముత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేసే యూరిక్ ఆమ్లాన్ని తగ్గించడానికి సహాయపడే యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా కలిగి ఉంటాయి.
ద్రాక్ష..
ద్రాక్ష పండ్లలో రెస్వెరాట్రాల్ ఉంటుంది. ఇది గుండె మరియు మూత్రపిండాల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ద్రాక్షలో పొటాషియం తక్కువగా ఉంటుంది.
పైనాపిల్..
పైనాపిల్ పొటాషియం అధికంగా కలిగి ఉంటుంది. ఇది ఉష్ణ మండల పండు. ఇందులో బ్రోమెలైన్ అధికంగా ఉంటుంది. ఇది శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉన్న ఎంజైమ్.
పుచ్చకాయ..
పుచ్చకాయ చర్మాన్ని హెడ్రేట్ చేస్తుంది. శరీరంలో టాక్సిన్లను బయటకు పంపడంలో సహాయపడుతుంది. ఇది వాపును కూడా తగ్గిస్తుంది. మూత్రపిండాల ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
యాపిల్స్..
యాపిల్స్ లో పొటాషియం తక్కువగా ఉంటుంది. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించడంలోనూ, శరీరంలో ఉండే వాపును తగ్గించడంలోనూ సహాయపడుతుంది.
పీచ్..
పీచ్ పండ్లలో పొటాషియం తక్కువగా ఉంటుంది. కానీ విటమిన్-ఎ, విటమిన్-సి అధికంగా ఉంటాయి. ఇది మూత్రపిండ రోగులకు చాలా మంచి పండు. అందులోనూ ఇది చాలా రుచిగా కూడా ఉంటుంది. అంతేకాదు.. ఈ పండు వేసవిలో విరివిగా దొరుకుతుంది.
క్రాన్బెర్రీ..
క్రాన్బెర్రీ పండ్లు మూత్ర మార్గ ఇన్ఫెక్షన్లను నివారించడంలో సహాయపడుతుంది. అలాగే కాల్ఫియం, ఆక్సలేట్ తో మూత్రపిండాలలో తయారయ్యే రాళ్లను తగ్గించడంలో సహాయపడుతుంది.
బేరి..
బేరి పండ్లలో జీర్ణక్రియకు సహాయపడే ఫైబర్ ఉంటుంది. అలాగే ఈ పండులో సోడియం తక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో ప్రయోజనకరంగా ఉంటుంది.
పైన చెప్పుకున్న పండ్లన్నీ మూత్రపిండాల ఆరోగ్యానికి ఎంతో బాగా సహాయపడతాయి. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండాలంటే పైన పేర్కొన్న పండ్లను తప్పక తినండి.
*రూపశ్రీ.



.webp)


