Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...నరేంద్రమోడీ మనిషికాదు జంతువు: బేణీ ప్రసాద్ వర్మ
posted on: Apr 25, 2014 3:34PM
.jpg)
నోరు పారేసుకోవడంలో కాంగ్రెస్ పార్టీలోనే నంబర్‌వన్ స్థానంలో వున్న కేంద్ర మంత్రి బేణీ ప్రసాద్ వర్మ గతంలో ఎన్నోసార్లు తిక్కవాగుడు వాగి అందరిచేత అక్షింతలు వేయించుకున్నాడు. అయితే తిట్టేనోరు ఊరుకోదన్నట్టుగా నోరు పారేసుకుంటూనే వుంటాడు. లేటెస్ట్ గా బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్రమోడీ మీద బేణీ ప్రసాద్ వర్మ నోరు పారేసుకున్నాడు. మోడీని ఆయన ‘జంతువు’ అని తీవ్రమైన వ్యాఖ్యలు చేశాడు. మోడీని బేణీ ప్రసాద్ వర్మ జంతువుగా అభివర్ణించడాన్ని భారతీయ జనతాపార్టీ నాయకుడు ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తీవ్రంగా ఖండించాడు. బేణి ప్రసాద్ వర్మకు మతిస్థిమితం తప్పినట్టుగా వుందని, తక్షణం ఆయనకు మానసిక వైద్య పరీక్షలు జరిపించాల్సిన అవసరం వుందని వ్యాఖ్యానించారు. త్వరలో ఓడిపోబోతున్నామన్న విషయాన్ని అర్థం చేసుకున్న కాంగ్రెస్ నేతలు ఆ బాధని తట్టుకోలేక నోటికొచ్చినట్టు వాగుతున్నారని ముక్తార్ అబ్బాస్ నఖ్వి అన్నారు.


.jpg)
.jpeg)


