Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...తిన్న తర్వాత 10నిమిషాలు నడిస్తే ఇన్ని ప్రయోజనాలు ఉంటాయని తెలుసా?
posted on: Mar 13, 2026 1:12PM
.webp)
ప్రతిరోజూ మూడు పూటలా ఆహారం తీసుకోవడం తప్పనిసరి. నేటికాలంలో ఆహారం విషయంలో చాలా సీరియస్ నెస్ వచ్చింది. నిజానికి నేటికాలంలో పుడీస్ ఎక్కువ అయ్యారు. నచ్చిన ఆహారం తినడంలో ఎలాంటి కాంప్రమైజ్ కావడం లేదు, నచ్చినంత తినడంలో కూడా ఎలాంటి కాంప్రమైజ్ కారు. అయితే ప్రతి రోజూ మూడు పూటలా ఆహారం తీసుకోవడం ఎంత సహాజమో.. ఆహారం తీసుకోగానే 10 నిమిషాలు నడవడం అంత ముఖ్యమని అంటున్నారు వైద్యులు, ఫిట్‌నెస్ నిపుణులు. ఆహారం తీసుకున్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే ఊహించని విధంగా ప్రయోజనాలు చేకూరతాయని అంటున్నారు. ఆ ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే..
వాకింగ్..
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఎలాంటి కష్టం లేకుండా, డబ్బు ఖర్చుపెట్టకుండా చేయగలిగే అతి తేలిక వ్యాయామం ఏదైనా ఉందంటే అది వాకింగ్ ఏ. వాకింగ్ ను చాలామంది దినచర్యలో భాగం చేసుకుంటారు. ఉదయం లేదా సాయంత్రం వాకింగ్ వెళ్లడం చేస్తుంటారు. కానీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆహారం తిన్న తర్వాత ఓ 10 నిమిషాలు నడవడం చాలా మంచి అలవాటు అని అంటున్నారు.
తిన్న తర్వాత 10 నిమిషాలు నడిస్తే కలిగే ప్రయోజాలు..
భోజనం తర్వాత ప్రతి రోజూ 10 నిమిషాలు నడిస్తే కాళ్ల కండరాలు బలపడతాయట. ఇది ప్రతిరోజూ ప్రాక్టీస్ చేస్తుంటే కొన్ని రోజులలోనే చాలా మంచి ఫలితాలు గమనించవచ్చని అంటున్నారు.
నేటికాలంలో చాలామంది ఎదుర్కుంటున్న సమస్య షుగర్. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువ ఉండటం వల్ల ఆహారం తీసుకోవడానికి కూడా భయపడుతుంటారు. అయితే ప్రతిరోజూ ఆహారం తీసుకున్న తర్వాత 10 నిమిషాలు వాకింగ్ చేయాలి. ఇలా చేయడం వల్ల చక్కెర స్థాయిలు అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది అని అంటున్నారు.
ఆహారం తిన్న తర్వాత 10 నిమిషాలు వాకింగ్ చేయడం వల్ల బరువు తగ్గడానికి సహాయపడుతుంది. వాకింగ్ చేయడం వల్ల శరీర కదలికలు జరిగి పేగులు కూడా కదలికలకు లోనవుతాయి. జీవక్రియ మెరుగవుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
ప్రతి చిన్న విషయానికి ఒత్తిడికి గురయ్యే వారు ఉంటారు. ఇలాంటి వారు బోజనం చేసిన తర్వాత 10న నిమిషాలు నడవడం అలవాటు చేసుకోవాలి. ఇది చాలా గొప్పగా సహాయపడుతుంది. మనసును ప్రశాంత పరుస్తుంది. ఒత్తిడి తగ్గిస్తుంది.
నేటికాలంలో చాలా మంది పొట్ట ఆరోగ్యంతోనే ఇబ్బంది పడుతున్నారు. చాలామందికి పొట్ట ముందుకు చొచ్చుకుని వచ్చి చాలా ఇబ్బంది పెడుతుంటుంది. నిజానికి ఇలాంటి వారికే డయాబెటిస్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే బోజనం చేయగానే కూర్చోవడం లేదా పడుకోవడం చేయకుండా 10 నిమిషాలు వాకింగ్ చేస్తే పొట్ట వచ్చే అవకాశాలు తగ్గుతాయి. బరువు కూడా తగ్గుతారు.
*రూపశ్రీ.


.webp)



