TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

స్థానిక సంస్థలకు తెలంగాణ క్యాబినెట్ ఆమోదం

Published on: Sat Aug 30, 2025 7:27PM

 

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే దానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెర దింపింది. తాజాగా జరిగిన క్యాబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ కేబినెట్ ఆమోదం ఆమోదం తెలిపింది. సెప్టెంబర్‌లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. 

ఎన్నికల కమిషన్‌కు తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు లేఖ రాసింది.తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  ఈ క్రమంలో ఎన్నికల కమిషన్‌కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో  భేటీ అయిన తెలంగాణ కేబినెట్ పలు కీలక నిర్ణయాలు చేసింది. స్థానిక ఎన్నికల రిజర్వేషన్లలో పరిమితి ఎత్తివేయాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం పేర్లను గవర్నర్‌కు క్యాబినెట్ సిఫార్సు చేసింది.

అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన ఈ మంత్రివర్గ సమావేశంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంతోపాటు, ఇటీవలి వర్షాలు, వరదలతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంపైనా చర్చించారు. పంటలు, రోడ్లు, ఇతర నష్టాలపై కేంద్ర ఆర్థికశాఖ సాయం కోరుతూ తీర్మానం చేశారు. మరోవైపు సెప్టెంబర్‌ 30 లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి కూడా క్యేబినెట్ నిర్ణయం తీసుకుంది.