బాబు కొత్త సమస్యలు ఆహ్వానించుకొంటున్నారా?

 

విశాఖ ఏజన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలకు ఏపీఎండీసీకి అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడాన్ని నిరసిస్తూ, ప్రజా సంఘాలు, వామ పక్షాలు నేడు ఏజెన్సీ ప్రాంతంలో బంద్ కి పిలుపునిచ్చాయి. స్థానిక గిరిజనులు, మావోయిస్టులు కూడా బాక్సైట్ తవ్వకాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు కనుక వారు కూడా ఈ బంద్ కి పూర్తి మద్దతు తెలుపుతున్నారు. ఇదివరకు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయనే ఏజన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలను వ్యతిరేకించిన సంగతిని వారు ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇప్పటికయినా ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతున్నారు.

 

బాక్సైట్ తవ్వకాలను గిరిజనులు, ప్రజా సంఘాలు వ్యతిరేకిస్తున్న సంగతి చంద్రబాబు నాయుడు కూడా తెలుసు. అయినా ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకొన్నారో తెలియదు. రాజధాని రాయలసీమలో త్వరలో సరికొత్త సమస్యలు ఎదుర్కోవలసిన తరుణంలో ప్రభుత్వ నిర్ణయంతో ఉత్తరాంధ్రలో కూడా ఈ కారణంగా సమస్యలు స్వయంగా ఆహ్వానించుకొన్నట్లు అవుతుంది. కనుక బాక్సైట్ తవ్వకాలపై ప్రభుత్వం పునరాలోచించుకోవడం మంచిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపరుతున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu