విద్యామంత్రిగారూ.. ఏమంటిరి.. ఏమంటిరి?

చ‌దువుకునే పిల్ల‌ల‌కు కావ‌ల‌సినవి స‌మ‌కూర్చ‌న‌పుడు  ప్ర‌భుత్వాలెందుకు? ఇప్పుడు అంత‌టా విన‌ప‌డుతోన్న ప్ర‌శ్న ఇదే. 
బాస‌ర  ట్రిపుల్ఐటిలో అనేక స‌మ‌స్య‌ల ప‌రిష్కారం గురించి విద్యార్ధులు అనేక రోజులుగా గోడు పెడుతున్నారు. వైస్ ఛాన్స‌ల‌ర్ లేక‌పోవ‌డం, లైబ్ర‌రీలో పుస్త‌కాలు లేక‌పోవ‌డం .. ఇలా అనేకం. వాటికి  తెలంగాణ ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించి  వారికి కావ‌లసినవి స‌మ‌కూర్చ‌డంలో విఫ‌ల‌మ‌యింది.  

తెలంగాణాలో విద్యార్ధిలోకం కూడా పూనుకుంటేనే రాష్ట్రం ఏర్ప‌డింద‌న్న‌ది టిఆర్ ఎస్ ప్ర‌భుత్వం ఎప్పుడో మ‌ర్చిపోయింది. కాకున్నా, విద్య‌ర్దులు కాక‌మ్మ కోరిక‌లేమీ కోర‌డం లేదు.   మౌలిక స‌దుపాయాల గురించి త‌లెత్తిన స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించ‌మ‌నే గోడు పెడుతున్నారు. వాట‌ని అవేమీ పెద్ద అంశాలు కానట్టు, అస‌లు వారి గోల‌ను పెద్ద‌గా ప‌ట్టించుకోన వ‌స‌రం లేనట్టు ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రిస్తోంది. అందుకే తీవ్ర‌స్థాయిలో విద్యార్ధులు మండి ప‌డి భారీ నినాదాల‌తో ముఖ్య‌మంత్రికి, విద్యా శాఖ మంత్రికి  బాస‌ర ట్రిపుల్ ఐటిలో ప‌రిస్థితులు బాగా తెలిసేలా బాగా వినిపించేలా ఉద్య‌మి స్తున్నారు. కానీ విద్యామంత్రి స‌బితా ఇంద్రారెడ్డిగారికి వారి ప‌రిస్థితులు, స‌మ‌స్య‌లు చాలా చిన్న‌విగా  క‌న‌ప‌డ‌ట‌మే విడ్డూరం.

ముఖ్యమంత్రితో సంప్ర‌దించి వెంట‌నే వారి స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాల్సిందిబోయి అవి చిన్న స‌మ‌స్య‌లే, వాటి గురించి ఆందోళ‌న‌కు దిగ‌డం మంచిది కాదు, ప్ర‌భుత్వం ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగేలా చేయ‌రాద‌ని మంత్రిగారు ఒక లేఖ‌లో విద్యార్ధుల‌ను కోర‌డంలో అర్ధ మేమిటో మంత్రి గారే సెల‌వియ్యాలి. అంతే కాకుండా బాసర ట్రిపుల్ఐటీ అన్న విషయమే విద్యామంత్రి సబిత గారికి తెలియదు. అందుకే కాబోలు బాసర ఐఐటి అని ప్రస్తావించారు.   బాస‌ర‌లో వున్న‌ది ఐఐటి కాదు త్రిబుల్ ఐటి! ఈ విష‌యాన్ని కూడా విస్మ‌రించారు. మొన్న‌టివ‌ర‌కూ ఎంతో ప్ర‌తిష్టాత్మ‌క‌మ‌యిన‌ది,

ప్ర‌భుత్వానికి రాష్ట్రానికి ఎంతో పేరు తెస్తున్న సంస్థ అంటూ పొగిడిన‌వారే విద్యా ర్ధుల మౌలిక వ‌స తుల గురించి ప‌ట్టించుకొన‌కుండా కేవ‌లం రాజ‌కీయ ప్ర‌సంగాల‌తో మ‌భ్య‌పెట్టే ప్ర‌య‌త్నాలు చేయ‌డంలో అర్ధ‌మే మిట‌ని విద్యార్ధి లోకం ప్ర‌శ్నిస్తోంది. ఐఐఐటికి  శాశ్వ‌త వైస్ ఛాన్స‌ల‌ర్‌ను నియ‌మించ‌డానికి మీన‌మేషాలు లెక్కించ‌డాన్ని రాజకీయ దురుద్దేశం గానే తీసుకోవాలా? ఎందుకు ఇంత నిర్ల‌క్ష్య‌మ‌ని అడుగుతున్నారు. త‌ల్లిలా తాను చెబుతున్న మాట‌లు విద్యా ర్ధులు  చెవికెక్కిం చుకోని ఉద్య‌మించ‌డం ఆపేయాల‌ని అడుగుతున్న మంత్రి మ‌రి ఇన్ని రోజులు త‌న బిడ్డ‌ల‌వంటి విద్యార్ధుల గోడు విన‌డానికి స‌మ‌యం ఇవ్వకపోవడమేమిటి?   విద్యార్ధుల భ‌విష్య‌త్తుతో ఆడుకున్న ప్ర‌భుత్వాలు క‌ల‌కాలం నిల‌వ‌వు అన్న‌ది  చరిత్ర చెబుతున్న సత్యం. ఇప్పటికైనా  తెలంగాణా ముఖ్య‌మంత్రి, విద్యాశాఖ మంత్రి కూడా ఈ విష‌యంలో మంచి నిర్ణ‌యం తీసుకుంటార‌నే ఆశిద్దాం.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu