కంటి క్యాన్సర్ కు థెరపీ

కంటి క్యాన్సర్ తో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రోగులకు శుభవార్త. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కంటి క్యాన్సర్ థెరపీని విజయ వంతంగా  నిర్వహించింది. కంటి క్యాన్సర్ రోగులకు అక్యులర్ ట్యూమర్లు కు ఎయిమ్స్ ఢిల్లీ డాక్టర్లు రుతినియం 106 ప్లాక్యూ ను వినియోగించి రక్త నాళాలలో ఉండే ట్యూమర్లను హోలగించడంలో వైద్యులు విజయం సాధించారు. బాబా అటామిక్  రీసెర్చ్ సెంటర్ కంటి క్యాన్సర్ కు థెరపీ రోగులకు అందుబాటులోకి తెచ్చింది. ఈమేరకు కేంద్ర అణు శక్తి ఇంధన శాఖా మంత్రి జితేందర్ సింగ్ అదే శాఖకు చెందిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అఫామిక్సైన్స్ ఎయిమ్స్ బాబా అటామిక్ ఎనర్జీ సెంటర్ సంయుక్తంగా అతి తక్కువ ఖర్చులో దీనిని రూపొందించినట్లు తెలిపారు. తక్కువ ఖర్చుతో రూపొందించిన సింపుల్ గ ఉండే పద్ధతి అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగానే రూపొందించామని తెలిపారు. బాబా అటామిక్ ఎనెర్జీ  అభివృద్ధి చేసిన్ ప్లాక్ సర్జన్లకు చాల సులభమైనదని అన్నారు. ప్లాక్ థెరపీ రేడియో యాక్టివ్ సోర్స్ తో రుతినియం 106 రేడియో వేస్ట్ నుండి రూపొందించినట్లు తెలిపారు. ఇది చాల సులభమైనదని చిన్న పరిమాణంలో ఉండే ప్లాక్యూ 50 మంది రోగులకు సంవత్సరం పాటు వినియోగించవచ్చని చెప్పారు.

కాగా ఎయిమ్స్ ఈ చికిత్సను చేసేందుకు రెండు ఆసుపత్రులకు అందించనుంది.  అందుకు శంకర్ నేత్రాలయా హైద్రాబాద్, బెంగుళూరు ఆసుపత్రులను ఎంపిక చేసినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మోడీ ప్రకటించిన వోకల్ ఫర్ లోకల్ అన్న నినాదానికి బలం చేకూర్చి నట్లయింది. గత సంవత్సరం అక్టోబర్ లో డిఏసి  ఛైర్మెన్ వ్యాస్ జితేంద్ర సింగ్ తో సుదీర్ఘ చర్చలు అనంతరం డీఐఈ, బార్క్, ఎయిమ్స్ , ఆప్తమాలిక్ సైన్సెస్ శాఖలు సంయుక్తంగా డాక్టర్ వ్యాస్, డాక్టర్ అతుకుమార్, డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ల సమన్వయంతో రూపొందించామన్నారు. అయితే కేంద్ర మంత్రి జితేంద్రసింగ్ డాక్టర్ కావడం వల్ల ఇది సాధ్యమైందని పేర్కొన్నారు.