బాపు కన్నుమూత.. చంద్రబాబు సంతాపం
Published on: Sun Aug 31, 2014 6:39PM

ప్రఖ్యాత చిత్రకారుడు, దర్శకుడు బాపు కన్నుమూయడం పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాపు మరణం తెలుగు ప్రజలకు తీరని లోటు అని చంద్రబాబు అన్నారు. బాపు స్మృతికి నివాళులు అర్పించిన చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. బాపు మరణంతో ఒక ధ్రువతార నేలరాలిందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.


