బ్యాంకు ఉద్యోగులే నగలు నొక్కేశారు

posted on: May 29, 2018 11:46AM

అది తమిళనాడులోని బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా తిరువళ్లూరు బ్రాంచ్‌. జాతీయ బ్యాంకు కదా అని 600 మందికి పైగా తమ నగలను అందులో దాచుకున్నారు. కానీ వన్ ఫైన్‌ మార్నింగ్ బ్యాంకు బీరువా తీసిచూస్తే నగలన్నీ మాయమైపోయి ఉన్నాయి. ఒకటి కాదు రెండు కాదు... ఏకంగా ఎనిమిది కోట్ల నగలు గాల్లో కలిసిపోయాయి. ఇదంతా ఇంటి దొంగల పుణ్యమే అని పోలీసులకి అర్థమైపోయింది. అందుకే ఒకొక్కరినీ పిలిచి నిదానంగా విచారిస్తున్నారు. దొంగ పట్టుబడతాడని పోలీసులు చెబుతున్నా, మళ్లీ బ్యాంకులో నగలు పెట్టుకోవాలంటే మాత్రం వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు.

google-ad-img
    Related Sigment News
    • Loading...