వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్

posted on: Mar 19, 2015 2:34PM

 

ప్రపంచ కప్ క్రికెట్ భారత్ - బంగ్లాదేశ్ జట్ల మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు 302 పరుగులు చేసింది. 303 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ జట్టు 33 పరుగుల వద్ద వరుసగా రెండు వికెట్లను కోల్పోయింది. మ్యాచ్ ప్రారంభం నుంచీ ధాటిగా ఆడుతున్న తమీమ్ ఇక్బాల్ యాదవ్ బౌలింగ్‌లో ధోనీ క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు. ఈ క్యాచ్‌ని అంపైర్లు సమీక్షించిన అనంతరం ఔట్‌గా ప్రకటించారు. ఆ తర్వాతి బాల్‌‌కి పరుగు చేయబోయిన బ్యాట్స్‌మన్ కయెన్ రనౌట్ అయ్యాడు. దూకుడు మీద ఆడి 303 పరుగులు చేయాలని అనుకున్న బంగ్లాదేశ్ ‌జట్టు వరుసగా రెండు వికెట్లను కోల్పోవడం షాక్‌నిచ్చింది.

google-ad-img
    Related Sigment News
    • Loading...