TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎంఐఎం అసెంబ్లీ వాకౌట్‌... బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Published on: Mon Mar 16, 2026 4:34PM

 

తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ‘వందేమాతరం’ అంశం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ శాసన సభలో ‘వందేమాతరం’ ఆలపిస్తున్న సమయంలో ఎంఐఎం ఎమ్మెల్యేలు వాకౌట్ చేయడంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ కుమార్  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను ఖండిస్తూ ఆయన సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో స్పందిస్తూ ఎంఐఎం వైఖరిపై మండి పడ్డారు. తెలంగాణ శాసనసభలో జాతీయ గీతమైన ‘వందేమాతరం’ ఆలపిస్తున్న సమయంలో మజ్లిస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేయడం అత్యంత సిగ్గుచేటైన చర్య అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. 

ఇది కేవలం ఒక రాజకీయ నిరసన మాత్రమే కాదని, దేశానికి గౌరవ సూచకమైన జాతీయ గీతం పట్ల అవమానకరమైన ప్రవర్తనగా భావించాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు. భారత దేశ స్వాతంత్ర్య పోరాట కాలంలో ప్రజల్లో జాతీయ స్పూర్తి ని నింపిన గీతం ‘వందేమాతరం’ అని గుర్తు చేసిన బండి సంజయ్, అలాంటి గీతాన్ని గౌరవించా ల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికీ ఉందన్నారు. దేశానికి సంబంధించిన చిహ్నాలు, సంప్రదాయాలు, జాతీయ భావాలను గౌరవించడం ప్రతి భారతీయుడి కర్తవ్య మని ఆయన అన్నారు. అయితే ఎంఐఎం ఎమ్మె ల్యేలు సభ నుంచి బయట కు వెళ్లడం ద్వారా తమ అసలు వైఖరిని మరోసారి బయటపెట్టారని బండి సంజయ్ విమర్శించారు.

భారతీయ చిహ్నాలు, జాతీయ భావాల పట్ల ఎంఐఎం ఎందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తుందో ప్రజలకు సమాధానం చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజల చేత ఎన్నికై శాసనసభకు వచ్చిన ప్రతినిధులు జాతీయ గౌరవాన్ని కాపాడే విధంగా ప్రవర్తించాల్సిన బాధ్యత ఉందని బండి సంజయ్ సూచించారు. ఈ ఘటనతో తెలం గాణ రాజకీయాల్లో మరోసారి జాతీయత, రాజకీయ నిరసనలపై చర్చ మొదలైంది. ఎంఐఎం ఎమ్మెల్యేల వాకౌట్‌పై వివిధ రాజకీయ పార్టీల నాయకులు భిన్నాభి ప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో మరింత చర్చకు దారితీసే అవకాశముంది.