Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...హైకోర్టులో బండి సాయి భగీరథ ముందస్తు బెయిల్ విచారణ
posted on: May 14, 2026 4:15PM
.webp)
బండి భగీరథ్ ముందస్తు బెయిల్ పిటిషన్ వారం రోజులు వాయిదా..
అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని బండి భగీరథ్ పిటిషన్ ..
ముందస్తు బెయిల్ వచ్చేవరకు అరెస్ట్ చేయకుండా ఆదేశాలు...
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముందస్తు బెయిల్ పిటిషన్ లో దాఖలైన మధ్యంతర రక్షణ పిటిషన్‌పై హైకోర్టు ఈరోజు వాదనలు విన్నది. ముందస్తు బెయిల్ వచ్చేవరకు అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని బండి భగీరథ తరఫున న్యాయవాది కోర్టును కోరారు.. వాదనలు విన్న అనంతర మధ్యంతర రక్షణ పిటిషన్ పై ఉత్తర్వుల కోసం రేపటికి వాయిదా వేసింది. యాంటిసిపెటోరీ బెయిల్ పిటిషన్ పై విచారణ వచ్చేవారం జరగనుంది...
ఈ విచారణ సందర్భంగా కేసులో ఉన్న యువతి మైనర్ అవునా.... కాదా... అనే అంశంపై న్యాయ మూర్తి కీలక ప్రశ్నలు లేవనెత్తారు. “ఆ అమ్మాయి మైనర్ కాదు, మేజర్ అని ఎలా నిరూపిస్తారు?” అని కోర్టు ప్రశ్నించింది
పిటిషనర్ తరఫున వాదించిన సీనియర్ కౌన్సిల్ నిరంజన్ రెడ్డి కీలక వివరాలు కోర్టుకు తెలియజేశారు. ఐదేళ్ల క్రితం నమోదైన ఒక కేసులో, యువతి 15 ఏళ్ల వయసులో కారు నడిపినట్లు నమోదు కాగా, అందులో ఉన్న జనన తేదీ వివరాలు సరైనవే అయితే ప్రస్తుతం ఆమె మేజర్ అవుతుందని వాదించారు.
అదే సమయంలో, యువతి పలు తేదీలతో జనన ధృవీకరణ పత్రాలు తీసుకున్నట్లు కోర్టుకు వివరించారు. ఈ కేసు పోక్సో చట్టంలోని సెక్షన్ 11 పరిధిలోకి రాదని, అలాగే భారత న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 74, 75 కింద ఆరోపణలు రుజువు కాలేదని పిటిషనర్ తరఫు న్యాయవాది తెలిపారు. సంబంధిత సంఘటన ఎనిమిది నెలల క్రితం జరిగినప్పటికీ, ఇప్పుడే ఫిర్యాదు చేయడం వెనుక దురుద్దేశం ఉందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. బాధితురాలు వయసు ప్రస్తుతం 19 నుంచి 20 సంవత్సరాల మధ్య ఉంటుందని తెలిపారు.
బాధితురాలి తల్లి తప్పుడు రికార్డులు సృష్టించి, వయసు తగ్గించి కఠినమైన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయించారని కోర్టుకు తెలియజేశారు. యువతి మైనర్ కాదని నిరూపించే ఆధారాలు ఉంటే వెంటనే కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది... బాధితురాలు పుట్టినరోజు తేదీపై గతంలో రాష్ డ్రైవింగ్ కేసులో అమ్మాయి మేజర్ అనే పోలీసులు ఫైల్ చేసిన చార్జిషీట్ పట్ల పోలీసులు విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది... ఫిర్యాదు చేసిన యువతి మరియు ఆమె కుటుంబం ఐదు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారని, డబ్బు చెల్లించక పోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారని పిటిషనర్ తెలిపారు.
ఈ బెదిరింపులకు లొంగకుండా కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ప్రముఖ రాజకీయ నాయకుడి కుమారుడు కావడంతో తనపై కుట్ర జరుగుతోందని పిటిషనర్ కోర్టుకు తెలిపారు.... అంతేకాకుండా సిటీలో బండి సంజయ్ కుమార్ మరియు అతని కుమారుడు బండి భగీరథ పోస్టర్లు వేస్తున్నారు. వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని బండి సంజయ్ కొడుకు బండి భగీరథ తరఫున న్యాయవాది కోర్టుకు తెలియజేశారు... ఈ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణ వచ్చే వారం జరగనుంది..


.webp)
.webp)


