బందరు లడ్డు కోసం కాంగ్రెస్ లో పోటీ

 

ఎమ్మెల్యే పేర్ని నాని వైకాపాలోకి జంపు చేయడంతో ఆయన ఖాళీ చేసిన బందరు సీటు కోసం అప్పుడే కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలు మొదలయ్యాయి. ఆయనకీ ధీటుగా మరో అభ్యర్ధిని నిలబెట్టి బందరులో నానికి తగిన గుణ పాఠం చెప్పాలని కాంగ్రెస్ ఆలోచిస్తుంటే, మంత్రి పార్ధసారధి, మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్, మాజీ యంపీ బాడిగ రామకృష్ణ ముగ్గురూ కూడా బందరు సీటు కోసం రాజకీయం మొదలుపెట్టేసారు. వీరే కాకుండా 2009లో మచిలీపట్నం లోక్‌సభ నుంచి పోటీ చేసి ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా కొనసాగుతున్న సి.రామచంద్రయ్యతో బాటు మరికొందరు కూడా బందరుపై కన్నేశారు. అయితే, కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ నియోజక వర్గం పట్ల గట్టి పట్టుదలగా ఉన్నందున రామచంద్రయ్యకు అక్కడ వేలు పెట్టె అవకాశ ఉండక పోవచ్చును. తాజా సమాచారం ప్రకారం వేదవ్యాస్‌కు పెడన బాధ్యతలు, మంత్రి పార్థ సారధి వర్గీయులకు బందరు శాసన సభ స్థానం, బాడిగ రామకృష్ణ కు బందరు లోక్ సభ స్థానం పంచుకొనేలా సర్దుబాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu