Latest News

శ్రీవారిని దర్శించుకున్న 'లెజెండ్' బాలయ్య

posted on: Apr 3, 2014 12:12PM

 

 

 

నటసింహం నందమూరి బాలకృష్ణ చాలాకాలంగా ఎదురుచూస్తున్న విజయం ‘లెజెండ్’ ద్వారా దక్కడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా వుంది. లెజెండ్ చిత్ర విజయోత్సవ యాత్రలో భాగంగా ఆ చిత్ర యూనిట్ గురువారం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. నటుడు బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఆయన విజయ యాత్రను చేయడంతోపాటు పనిలోపనిగా తీర్థయాత్రను కూడా చేస్తున్నారు.

 

విజయ యాత్రలో ఏ ప్రాంతానికి వెళ్ళినా సమీపంలోని ప్రసిద్ధ దేవాలయాలను దర్శిస్తున్నారు. సింహాచలం, విజయవాడ కనకదుర్గమ్మ గుడి, మంగళగిరి పానకాల స్వామి, తిరుమల వేంకటేశ్వరాలయం తదితర పుణ్యక్షేత్రాలకు బాలకృష్ణ వెళ్ళారు. ఈ విజయయాత్ర కమ్ తీర్థయాత్రలో భాగంలో బాలకృష్ణ మరిన్ని పుణ్యక్షేత్రాలను సందర్భించే అవకాశం వుందని తెలుస్తోంది.
 

google-ad-img
    Related Sigment News
    • Loading...