Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...బాలకృష్ణ ‘లెజెండ్’కి ఇ.సి. బ్రేక్ వేస్తుందా?
posted on: Apr 24, 2014 4:17PM
.jpg)
నందమూరి బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ సినిమా ప్రదర్శనను ఎన్నికలు పూర్తయ్యే వరకు నిలిపివేయాలని జగన్ పార్టీ ఎన్నికల కమిషన్‌కి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. నందమూరి బాలకృష్ణ ఎన్నికలలో పోటీ చేయడంతోపాటు తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేస్తున్నారు. ఆయన నటించిన ‘లెజెండ్’ సినిమా ఓటర్లమీద ప్రభావం చూపించే అవకాశం వుంది కాబట్టి ఆ సినిమా ప్రదర్శనని నిలిపివేయాలని వైసీపీ ఎన్నికల కమిషన్‌ని అభ్యర్థించింది. దీని మీద తెలుగుదేశం వర్గాలు వైసీపీ మీద మండిపడ్డాయి. ఇదిలావుంటే వైసీపీ అభ్యర్థనకు స్పందించిన ఇ.సి. ‘లెజెండ్’ సినిమా చూసి అందులో రాజకీయ అంశాలు, ఓటర్లను ప్రభావితం చేసే అంశాలు ఉన్నాయేమో పరిశీలించాలని నిర్ణయించింది. దీంతో ఈ సినిమాని ఎన్నికల కమిషన్ ప్రతినిధులకు హైదరాబాద్‌లోని ప్రసాద్ లాబ్స్ లో ప్రదర్శిస్తున్నారు. ఎన్నికల కమిషన్ ప్రతినిధులు ఈ సినిమా చూసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ‘లెజెండ్’ ప్రదర్శనను నిలిపివేయడానికి ఆదేశాలు జారీ చేస్తారన్న నమ్మకంలో వైసీపీ నేతలు వున్నారు. అయితే అలా జరిగే అవకాశమే లేదని తెలుగుదేశం నాయకులు అంటున్నారు.


.jpg)



